Advertisement
ఒకప్పుడు సహజీవనం అంటే వింతగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు సహజీవనం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అంతేకాకుండా సహజీవనం కూడా కామన్ గా చూస్తున్నారు. కాగా, తాజాగా ఓ మహిళా తన సహజీవనం అనుభవాలను మీడియాతో పంచుకుంది. తమిళనాడుకు చెందిన కవిత గజేంద్రన్ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కవిత గజేంద్రన్ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది.
Advertisement
READ ALSO : MS NARAYANA IN DUBAI SEENU: “దుబాయ్ శీను” సినిమాలో ఎం ఎస్ నారాయణ క్యారెక్టర్ ఆ హీరో టార్గెట్ గా చేసారా ?
అయితే జీవితంలో ఓ తోడు కావాలి కాబట్టి రాజా సంగీతన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. కవిత వామపక్ష రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తోంది. రాజా సంగీతన్ కూడా వామపక్ష రాజకీయాల్లోనే పనిచేయడంతో పాటు ఆయన మంచి రచయిత. ఇక ఓ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ స్వేచ్ఛ స్వతంత్రాలు కట్టడి చేయలేని బంధం కోసమే సహజీవనం నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని తెలిపింది.
Advertisement
READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?
ఇంట్లో ఒత్తిడి వల్ల 25 ఏళ్ల వయసులో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తను చెడ్డవాడు కాదని, కానీ కుటుంబం, సమాజం వల్ల తనపై ఆంక్షలు విధించాడని చెప్పింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మూడేళ్లకి విడాకులు తీసుకున్నామని చెప్పింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో రాజా సంగీతన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని, అతనితో నా భావాలు ఒకేలా ఉండటం వల్ల ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. వివాహం అందించలేని అవగాహన సహజీవనం అందించిందని చెప్పింది.
READ ALSO : రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?