Advertisement
ప్రేమ పేరుతో చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. అలానే అబ్బాయిలు కూడా. ప్రేమించిన వాళ్లతో పెళ్లి అవుతుందో లేదో తెలీదు కానీ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. వ్యసనాలని ప్రేమని అడ్డదారులు తొక్కుతున్నారు. చాలామంది ప్రేమ పేరుతో అవసరానికి వినియోగించుకుంటున్నారు. ప్రేమ అంటారు కానీ పెళ్లి అనే సరికి అమ్మాయిలు, అబ్బాయిలు మాయం అయిపోతున్నారు. అవసరం తీర్చుకోవడం అవసరమైన తర్వాత వదిలేయడమే ఈ రోజుల్లో చూస్తున్నాము.
Advertisement
ప్రేమ పేరుతో మోసం చేసి లక్షల రూపాయలను కూడా దండుకునే వాళ్ళు ఉన్నారు. ప్రేమికుడు నో కిడ్నాప్ చేసి 21 లక్షల రూపాయలని దోచుకున్న సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చిక్బల్లాపూర్ జిల్లా నంది హిల్స్ సమీపంలోని రిసార్ట్ లో ఇది జరిగింది. ప్రేమించిన అతనిది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా. బెంగళూరులో విజయ్ సింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి అని భావన రెడ్డి గమనించి లవ్ చేసింది.
Advertisement
డేటింగ్ కి వెళ్దామని కూడా ఫోన్ చేసి పిలిచింది. దేవనహళ్లికి వెళ్తున్నప్పుడు సినీ ఫక్కీలో అతన్ని కిడ్నాప్ చేసింది. నంది హిల్స్ కి దగ్గరలో ఉండే రిసార్ట్ కి అతన్ని తీసుకెళ్లారు. మొత్తం ఆరుగురు అతన్ని కిడ్నాప్ చేశారు. రిసార్ట్ కి తీసుకెళ్లిన తర్వాత దాడి చేయడం మొదలుపెట్టారు. మూడు రోజులపాటు అతన్ని బంధించారు.
21 లక్షలని అతని అకౌంట్ నుండి తీసుకున్నారు. అలానే రెండు లాప్టాప్ లు, మూడు మొబైల్ ఫోన్స్, 12 గ్రాముల బంగారాన్ని కూడా దోచుకున్నారు. జూన్ 16 నుండి 18 వరకు చిత్రహింసలు పెట్టారు. తర్వాత విడిచిపెట్టారు. ఆ వ్యక్తి ఆఖరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. భావన రెడ్డి తో పాటుగా పుల్లారెడ్డి, సుబ్రమణి, సుధీర్, సిద్దేశ్, నాగేశరెడ్డి పై కంప్లైంట్ చేయగా.. 506,341,504,143,149,384, 323, 324 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read:
ఒక్కర్తే కూతురు.. భర్త, బావ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య..!
బాహుబలి సినిమాలో.. జక్కన్న చేసిన ఈ చిన్న తప్పుని మీరు గమనించారా..?
మరణించిన వ్యక్తి యొక్క.. ఈ 3 వస్తువులని అస్సలు ఉపయోగించద్దు..!