Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండగలిగిన మానవ శిఖరాగ్రాన్ని రజనీకాంత్ లోనే చూడగలం. ఆయన ఎప్పుడూ సూపర్ స్టార్ లా ప్రవర్తించరు. ఎక్కడికైనా ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళిపోతారు. ఆయన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. అందుకే ఆయనంటే ఎంతో మందికి ఇష్టం. దశాబ్దాల పాటు ప్రజల మనసులో నిలవడం అనేది ఆ చరిత్రకు దక్కే గౌరవం. ఆ చరిత్ర పేరే రజనీకాంత్. సినిమా హీరోకి కావలసిన రంగు, శరీర సౌష్టవం.. ఇటువంటి హంగులు ఏమీ లేవు ఆయన దగ్గర. కష్టించి పనిచేసే మనస్తత్వమే ఉంది. అలాంటి రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే రజనీకాంత్ కు ఒక సందర్భంలో గుడిలో తీవ్రమైన అవమానం జరిగిందట. అదేంటో తెలుసుకుందాం.
Advertisement
Advertisement
2007లో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా చేసిన శివాజీ మూవీ ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందో తెలిసిన విషయమే. ఈ సినిమా అంతటి ఘనవిజయాన్ని సాధించడానికి ఆ భగవంతుడే కారణం అని నమ్మిన రజినీకాంత్ దైవ దర్శనం కోసమని గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ కారణంగా గుడిలో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మారువేషంలో గుడికి వెళ్లారు. ఒక నలిగిన తెల్లచొక్కా, తెల్లని లుంగీ కట్టుకొని, తలపై గోధుమ రంగు శాలువా ధరించి గుడికి వెళ్లారు. అయితే ఆయనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుడి దగ్గరికి వెళ్ళగానే ఒక వృద్ధుడిలా కుంటుకుంటూ నడిచారు. దీంతో ఆయనని ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఒక మధ్య వయసు ఉన్న గుజరాతి మహిళ నేరుగా రజనీకాంత్ దగ్గరకు వచ్చి పది రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టేసింది.
దీంతో రజినీకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమె ఇచ్చిన పది రూపాయలను తీసుకొని గుడిలో కలిగి వెళ్లి దైవ దర్శనం చేసుకుని హుండీలో 100 రూపాయలు వేశారు. ఇది గమనించిన ఆ మహిళ ఆ తర్వాత రజనీకాంత్ బయటకు వచ్చి ఖరీదైన కారు ఎక్కడం చూసింది. వెంటనే రజనీకాంత్ దగ్గరికి వెళ్లి ఆ వాహనాన్ని ఆపి మరి మన్నించమని వేడుకుంది. ఆమె ఇచ్చిన పది రూపాయలను కూడా వెనక్కి ఇవ్వాలని కోరింది. దీనికి రజనీకాంత్ నవ్వుతూ.. ప్రతిసారి ఆ భగవంతుడు తన ముందు నేనొక బిచ్చగాడిని అని ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆ భగవంతుడు ఆడించిన నాటకంలో మీరు, నేను సాధారణ మనుషులం అని ఆ మహిళతో అన్నారు. అలా గుడిలో జరిగిన సంఘటనని ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
Read also: అనుష్క పక్కన అదరగొట్టిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?