Advertisement
చాలామంది తెలుగు వాళ్ళు గల్ఫ్ లో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎడారి దేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు నలిగిపోతుంటారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలని చూపిస్తూ ఎడారి దేశాలకు పంపిస్తూ ఉంటారు. కుటుంబ అవసరాల కోసం అక్కడ పనిచేయడానికి సిద్ధపడతారు. అదే అదునుగా తీసుకుని దళారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తూ అడ్డగోలు పనులు పెడుతున్నారు. యజమానులు పెట్టే ఇబ్బందుల్ని భరించలేక తిరిగి వచ్చే మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు.
Advertisement
ఎడారుల్లో పశువుల సంరక్షణలో పనికి కుదురుతున్నారు. తిండి లేక నిద్ర లేక అనారోగ్యానికి గురై ప్రాణాలు మెరుగు తెచ్చుకుంటున్నారు. చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన విన్నపాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది చాలా మందిని తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఈ తరణంలో మస్కట్లో ఉన్న ఓ మహిళ అతి కష్టం మీద స్వగ్రామానికి తిరిగి వచ్చింది. మస్కట్ నుంచి హైదరాబాద్ కి ఆమె వచ్చింది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో వస్తుండగా గుండెపోటుతో చనిపోయింది. అంతులేని విషాదాన్ని కుటుంబంలో నింపింది.
Advertisement
Also read:
తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడి కి చెందిన సత్య పద్మకు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్ తో 15 ఏళ్ల క్రితమే పెళ్లయింది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. డబ్బులు సరిపోట్లేదని ఆమె మస్కట్ వెళ్ళింది. రెండేళ్ల కిందట రెండు లక్షల రూపాయలు చెల్లించి మస్కట్ వెళ్ళింది. ఆమెను వెనక్కి పంపించాలని భర్త చాలా సార్లు ఏజెంట్ ని కోరారు. ఇంకో రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ పంపించడం కుదరదని చెప్తే ఆ డబ్బును కూడా కట్టారు. ఇంకో వారం రోజుల్లో తిరిగి వస్తుందనుకుంటే విగతజీవిగా తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!