Advertisement
అనేక రకాల వ్యక్తిత్వాలు, ముఖ భావాలు కలిగిన మనుషులు మనకి కనపడుతుంటారు. కొందరు ఎక్కువగా మాట్లాడుతుంటే కొంతమంది మాత్రం సైలెంట్ గా ఉంటారు. అసలు ఏమీ తెలియని వాళ్ళలా కనబడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మనం అంచనా వేయలేము. సాధారణంగా అమాయకంగా యువతి కనపడితే ఆమె కూడా ఏదైనా పని కోసం ఎదురు చూస్తుందేమో సహాయం కావాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. బెంగుళూరు నగరంలోని దివ్య అనే 22 ఏళ్ల యువతి విషయంలో ఓ వ్యాపారి ఇదే అనుకున్నాడు. బెంగళూరు శివారు ప్రాంతమైన ఎమలూరులో ఓ విల్లాలో వ్యాపారవేత్త ఉంటున్నాడు.
Advertisement
ఆయన పిల్లల సంరక్షణ కోసం దివ్యని పెట్టుకున్నారు చూడడానికి ఎంతో అమాయకంగా ఉండడంతో ఏ సందేహం కూడా ఆయనకి కలగలేదు. దివ్య పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసేది. దివ్య ఇంట్లో పని బాగా చేస్తుండడంతో యజమానులు సంతోషంగా ఉన్నారు. వ్యాపారి ఇంట్లో నెక్లెస్ తో సహా దాదాపు 50 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి పారిపోయింది. బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆ వ్యాపారి పోలీసులకి కంప్లైంట్ చేశాడు అనంతరం విచారించే క్రమంలో దివ్య హైడ్రామాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Also read:
ఆమె చేయి కోసుకుని ఆసుపత్రికి వెళ్లాలని డ్రామా ఆడింది పోలీసులు అలర్ట్ అవ్వడంతో ఆమె డ్రామాకు తెరపడింది. ఆమె బంధువుల సహకారంతో ఆభరణాలను కూడా అమ్మేసింది ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమెకు సహకరించిన మంజు జోమన్లను కూడా అరెస్ట్ చేశారు దివ్యశ్రీ ఇంట్లోనే బంగారు ఆభరణాలను దొంగలించిన వస్తువుల్ని విక్రయించేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!