Advertisement
ఆన్లైన్లో పరిచయం అవడం పరిచయం కాస్త ప్రేమగా మారడం.. తర్వాత పెళ్లి చేసుకోవడం ఇటువంటివి చూస్తూ ఉంటాం. పెళ్లి చేసుకుని పోనీ ఆనందంగా ఉంటారా అంటే మోసపోవడం వంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడీ ప్రాంతంలో అంజూ, అర్వింద్ దంపతులు వుంటున్నారు. 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. అంజు(34) కి కొన్ని నెలల క్రితం ఫెస్‌బుక్‌లో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా పరిచయం అయ్యాడు.
Advertisement
Advertisement
అది కాస్తా ప్రేమగా మారింది. నస్రుల్లా పాకిస్థాన్‌లో ఔషధ రంగంలో వర్క్ చేస్తున్నాడట. అంజు ఎలాగైనా కలుసుకోవాలనుకుంది. గురువారం పాకిస్థాన్ లోని ఖైధర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌దిర్ జిల్లాకు ఆమె వెళ్ళింది. కానీ పోలీసులు ఆమెను కస్టడీ లోకి తీసుకున్నారు. కానీ అన్ని పత్రాలు ఉండడంతో పోలీసులు విడిచిపెట్టారు. అదే విధంగా పోలాండ్‌కు చెందిన ఒక ఆమె కూడా జార్ఖండ్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఆరేళ్ల కుమార్తె ఆమెకి వున్నా కూడా పెళ్లి చేసుకునేందుకు జార్ఖండ్ వచ్చేసింది. ఇలా ఆన్ లైన్ లో పరిచయాలు ఈరోజుల్లో ఎక్కువవుతున్నాయి.
Also read: