Advertisement
Women’s Asia Cup 2022 : మహిళల టి20 ఆసియా కప్ ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంక పై ఈజీ విజయాన్ని నమోదు చేసింది. ఇండియా మహిళల జట్టు ఆసియా కప్ ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇక ఆసియా కప్ ఛాంపియన్స్ గా నిలిచిన భారత జట్టుకు ప్రైస్ మనీ ఎంత లభించింది? ఆసియా కప్ టాప్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Advertisement
ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ కు ప్రైజ్ మనీ రూపంలో 20వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 16 లక్షల 40 ఎనిమిది వేల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్ ను టోర్నీ నిర్వాహకులు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు అందజేశారు. అదేవిధంగా రన్నరప్ గా నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల 30 వేలు) ప్రైజ్ మనీ దక్కింది.
Advertisement
ప్రైజ్ మనీతో అవార్డ్ విజేతల పూర్తి జాబితా
విజేతలు: భారతదేశం – $20000 (సుమారు ₹16,48,000)
రన్నర్స్-అప్: శ్రీలంక – $12,500 (సుమారు రూ.10,30,00)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్): రేణుకా సింగ్ – $1000 (సుమారు ₹82,000)
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: దీప్తి శర్మ – $2000 (సుమారు ₹1,64,000)
అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన
అత్యధిక పరుగులు : జెమిమా రోడ్రిగ్స్ (IND) – 217
Highest స్కోరు: హర్షిత మాదవి (SL) – 81
అత్యధిక సగటు: నిదా దార్ (PAK) – 72.50
అత్యధిక అర్ధశతకాలు: జెమిమా రోడ్రిగ్స్ (IND) – 2
అత్యధిక సిక్సర్లు: షఫాలీ వర్మ (IND) – 6
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన
అత్యధిక వికెట్లు: దీప్తి శర్మ (IND) & ఇనోకా రణవీర (SL) – 13
అత్యుత్తమ బౌలింగ్ సగటు: రుమానా అహ్మద్ (BAN) – 5.80
ఉత్తమ బౌలింగ్ గణాంకాలు: ఒమైమా సోహైల్ (PAK) – 5/13
ఉత్తమ ఎకానమీ రేటు: మేఘనా సింగ్ (IND) – 2.40
Read also: పంజాగుట్ట గదికి ఇప్పటికీ అద్దె కడుతున్న త్రివిక్రమ్