Advertisement
పరిచయం :
కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో సుహాస్. ఈ సినిమా కంటే ముందు సుహాస్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అంతేకాకుండా సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలలో కనిపించాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సక్సెస్ ను అందుకున్నాడు. ఇక తాజాగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులకు తెగ వచ్చేసాయి. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ సినిమాలో సుహాస్ పేరెంట్స్ గా ఆశిష్ విద్యార్థి, రోహిణి నటించారు. ఈ సినిమాకు షణ్ముక్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా లేదా ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ కథనం:
విజయవాడలోని ఓ లైబ్రరీలో పద్మభూషణ్ (సుహాస్) లైబ్రేరియన్ గా పనిచేస్తూ ఉంటాడు. సుహాస్ కు పుస్తకాలు రాయాలనే ఆశయం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తొలి అడుగు అనే ఓ పుస్తకాన్ని రాస్తాడు. ఈ సినిమాలో సుహాస్ తండ్రి మధుసూదన్ రావు (ఆశిష్ విద్యార్థి) తల్లి సరస్వతి (రోహిణి) కూడా కొడుకును ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ సుహాస్ తల్లిదండ్రులకు తెలియకుండా తొలి అడుగు పుస్తకాన్ని పబ్లిష్ కూడా చేయిస్తాడు. కానీ పుస్తకం అసలు సేల్ కాదు… ఫ్రీగా ఇచ్చినా ఆ పుస్తకాన్ని చదివే వాళ్ళు ఉండరు.
Advertisement
అయితే అదే సమయంలో రైటర్ పద్మభూషణ్ పేరుతో ఓ పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. ఆ పుస్తకానికి ఎంతోమంది ఫ్యాన్స్ అవుతారు. దాంతో పద్మభూషణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సెలబ్రెటీ స్టేటస్ ను పొందుతాడు. అయితే ఆ పుస్తకం రాసింది ఎవరు అన్నది మాత్రం తెలియదు. అంతేకాకుండా సుహాస్ తన మరదలిని ఇష్టపడతాడు. ఇక పద్మభూషణ్ కు పాపులారిటీ రావడంతో అతడి మేనమామ కూడా తన కూతురిని ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. ఇంతలోనే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇక అసలు రైటర్ పద్మభూషణ్ పుస్తకాన్ని ఎవరు రాశారు..? చివరికి సుహాస్ పెళ్లి తన మరదలుతో జరిగిందా లేదా అన్నదే ఈ సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే :
సినిమా ట్రైలర్ ని చూసి మొదట కామెడీ ఎంటర్టైనర్ అని అనుకున్నారు. నిజానికి ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా….. సినిమాలో కామెడీ, ఎమోషన్స్ తో పాటు అన్ని సమపాల్లల్లో ఉన్నాయి. ఈ సినిమాలో సుహాస్ మరియు హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ను దర్శకుడు చక్కగా చూపించాడు. అంతే కాకుండా కథ పాతదే అయినప్పటికీ కథనం లో కొత్తదనం ఉంటుంది. నటీనటుల పర్ఫామెన్స్ లో ఎక్కడా తగ్గలేదు. అంతే కాకుండా దర్శకుడికి ఇదే మొదటి సినిమా అయినా ఆ ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా ను ఫ్యామిలీ తో కలిసి థియేటర్ లలో ఎంజాయ్ చేయవచ్చు.