Advertisement
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ డబ్లూడబ్లయూఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. మనదేశంలోనూ ఈ పోటీలకు పెద్ద క్రేజీనే ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఇది బిగ్ గుడ్ న్యూసే.అది ఏంటంటే.. సెప్టెంబర్ 08న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం ‘WWE సూపర్ స్పెక్టాకిల్’ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Advertisement
Advertisement
ఈ మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు మంత్రి. అంతర్జాతీయంగా పేరుపొందిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ ఈ పోటీలలో పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ లో ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, మహిళ ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్ లతో సహా కీలక WWE సూపర్ స్టార్స్ హాజరు అవుతారని తెలిపారు. అదేవిధంగా WWE సూపర్ స్టార్స్ జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీ పడనున్నారు. ఈ ఈవెంట్ టికెట్స్ www.bookmyshow.com లో అందుబాటులో ఉంటాయని తెలిపారి మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Also Read :