Advertisement
Sharmila son engagement Photos: షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రత్యేకంగా హాజరు అయ్యారు. అయితే.. ఆయన కొద్దీ సేపు మాత్రమే వేదిక వద్ద ఉండి.. వెంటనే వెళ్లిపోయారు. వై ఎస్ అభిమానులు చాలా గ్యాప్ తర్వాత జగన్, షర్మిల, విజయమ్మలను ఒకే ఫ్రేమ్‌లో చూడగలిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే.. వై ఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి నిశ్చితార్ధ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Advertisement
Sharmila son engagement Photos
వేడుకకు వచ్చిన తరువాత, ముందుగా షర్మిలను చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్న జగన్ అనంతరం యువ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తన మేనల్లుడు రాజాకు చిన్నగా కౌగిలించుకుని కాబోయే వధువు ప్రియా అట్లూరిని పలకరించాడు. డయాస్ నుంచి దిగిపోయే ముందు విజయమ్మతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత వైఎస్ కుటుంబం ఒకే వేదికపై కనిపించారు. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో ఎంగేజ్మెంట్ వేదిక ఉన్న ప్రాంతానికి చేరుకున్న జగన్.. చాలా కొద్దీ సేపు మాత్రమే అక్కడ ఉన్నారు.
Advertisement
Sharmila son engagement Photos
అయితే.. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తో కంటే.. ఆయన విజయమ్మతోనే ఎక్కువ చనువుగా ఉన్నారు. అయితే.. సీఎం జగన్ ఈ వేడుకకు హాజరు అయినప్పటికీ షర్మిల దంపతులు అంటీముట్టనట్లు ప్రవర్తించడం అందరి కళ్ళల్లో పడింది. ఇక వేడుక సందర్భంగా ఫోటో దిగడానికి కూడా రాలేదు. విజయమ్మ అప్పటికే రెండు సార్లు పిలిచి.. మూడవ సారి కూడా గట్టిగ అడగగా.. అప్పుడు వచ్చి చివరిలో నిల్చున్నారు. సీఎం జగన్ వచ్చి ఎక్కువ సేపు ఉండకుండా వెళ్లిపోయారు. ఉన్నంత సేపు కూడా ఆయన ముభావంగానే ఉండిపోయారు. షర్మిల, అనిల్ దంపతులు ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ గమనించిన నెటిజన్స్.. పిలిచి మరీ అవమానం చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More:
Raja Reddy Love Story: అట్లూరి ప్రియా, రాజారెడ్డి ల లవ్ స్టోరీ ఇదే !