Advertisement
తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో అన్ని ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందేమో అని చాలా మంది భావిస్తున్నారు. మిగతా ఆలయాల్లో వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదా కాదా అనేది టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల నుంచి నెయ్యి శాంపిల్స్ ని తీసి టెస్టులకి పంపించారు. ఇటీవల యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉపయోగించే నెయ్యిని కూడా టెస్ట్ కి పంపించడం జరిగింది. శాంపిల్స్ తీసుకుని చూడగానే స్వచ్ఛమైనదని నిర్ధారించారు. ప్రభుత్వ యాజమాన్యంలో విజయ డైరీ నుంచి రాష్ట్రంలో అన్ని దేవాలయాలు నెయ్యిని వినియోగించాలా లేదా అని ఆలయ అధికారులు ఆలోచిస్తున్నారు.
Advertisement
Advertisement
తిరుమల లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి పై కల్తీ జరుగుతోందని ఆరోపణలు రావడంతో తెలంగాణలో పలు ప్రధాన ఆలయాల ప్రసాదాల నెయ్యి నమూనాలని పరీక్షల కోసం సమర్పించాలని ప్రభుత్వ ఆదేశించడంతో టెస్టులకి పంపడం జరిగింది. టెస్ట్ చేయగా తేమ శాతం, కొవ్వు ఆమ్లాలు అన్ని పరిమితుల్లో ఉన్నాయని శాంపిల్స్ ద్వారా తెలుస్తోంది.
Also read:
ఒక పరీక్ష మాత్రమే కాకుండా పలు పరీక్షలు చేశారు ఇలా ఈ టెస్ట్ల ద్వారా నెయ్యి నాణ్యమైనది అని తెలిసింది. అలాగే నల్గొండలో ఒక ఆలయానికి మదర్ డైరీ నెయ్యిని సరఫరా చేస్తోంది. టెస్ట్ ఫలితాలు పాజిటివ్ గానే వచ్చాయి. దీనితో విజయ డైరీ ని కొనసాగించాలా లేదా మదర్ డైరీ నెయ్యి వాడాలా ఆణి ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. యాదాద్రిలో రోజుకి 100 కిలోల పులిహోర ప్రసాదం, 6 కిలోల దద్దోజనం ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!