Advertisement
యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఏం చేస్తున్నా కూడా సంచలనంగా మారిపోతుంది. ఇంగ్లాండు టెస్ట్ సిరీస్ లో రెండు డబల్ సెంచరీలు చేశాడు. యశస్వి ఐసిసి ర్యాంకుల్లో కూడా జోరిని చూపించాడు. టాప్ 20లోకి వచ్చేసాడు. అత్యంత ఖరీదైన ముంబై మహానగరంలో బాంద్రా ప్రాంతంలో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఈస్ట్ బాంద్రా లో వింగ్ 3 ఏరియాలో 11 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ ధర దాదాపు 5.4 కోట్లు ఉంటుందట. క్రికెటర్గా మారిన క్రమంలో 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ చాలా కష్టాలు అనుభవించాడు. కొన్ని ఏళ్ళు టెంట్లో కూడా గడిపే వాడట. అతని కోసం కుటుంబం యూపీ నుండి ముంబైకి మారింది. క్రికెట్ శిక్షణ కోసం వెళ్లే టైంలో పానీపూరి బండి వద్ద పని చేసారు కూడా.
Advertisement
Advertisement
యశస్వి జైస్వాల్ జూనియర్ లెవెల్ లో కూడా తన సత్తాని చాటాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అండర్ 19 వరల్డ్ కప్ 2019లో అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ లోకి కూడా అడుగుపెట్టే అవకాశం వచ్చింది. మొదటిసారి 2.4 కోట్ల బిడ్ కి దక్కించుకున్నాడు యశస్విజయస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున 2023 సీజన్ 14 మ్యాచ్ లోను ఆడాడు. 625 పరుగులు స్కోరు చేసాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. యశస్వి కేవలం 3 టెస్టుల్లోనే 545 పరుగులని సాధించాడు.
నిజానికి కష్టపడితే ఏదో ఒక రోజు విషయం వస్తుందని అందరూ అంటూ ఉంటారు. అది నిజమేనని యశస్వి ప్రూవ్ చేశారు. చిన్నప్పుడు ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు ఆ కష్టాలన్నీటిని దాటుకుని ఈరోజు ఇంత గొప్ప పొజిషన్ లోకి వచ్చాడు. క్రికెట్ నేర్చుకోవడానికి 10 ఏళ్ల వయసు అప్పుడు యశస్వి తన సొంత ఊరిని వదిలేసి ముంబైకి వచ్చాడు. మూడేళ్లు ముస్లిం యునైటెడ్ క్లబ్ దగ్గర టెంట్లో ఉండేవారట చాలా రోజులు ఆకలితోనే నిద్రపోయాడట. ఇలా ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఇక ఇప్పుడు మంచి క్రికెట్ గా రాణిస్తున్నాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి..!