Advertisement
మరికొన్ని ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో టీడీపీ పరిస్థితి అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరుగుతోంది అంటూ కొంతమంది వైసీపీ వర్గాల్లో ఆందోళన కూడా మొదలైంది. ఏపీలో ఏదేదో జరిగిపోతుంది అంటూ కంగారు పడుతున్న వైసీపీ వర్గాలకు సీఎం జగన్ ధైర్యం నూరిపోశారు. ఈసారి ఎన్నికల్లో కూడా 175 స్థానాల్లోనూ వైసీపీనే గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేసారు.
Advertisement
ఇవి కూడా చదవండి: లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యడానికి కారణం ఏమిటి?
ఇటీవల జరిగిన మీటింగ్ లో జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. 2019 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమమే అజెండాగా పాలన సాగించామని.. ఈసారి 175 స్థానాలు వైసీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. రెండు విపక్ష పార్టీలు పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఏపీలో ఎదో జరిగిపోతోంది అని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ ఇటీవల అధికార పార్టీ జరిపిన సర్వేలో ఈ పొత్తు వలన వైసీపీ కి వచ్చే నష్టం ఏమీ లేదని తేలిందట. ప్రజల్లో వైసీపీ పట్ల అభిమానం ఉన్నట్లు ఈ సర్వేల్లో తేలిందట.
Advertisement
ఇవి కూడా చదవండి: కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!
అధికారం చేపట్టినప్పటి నుంచే జగన్ విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చారు. కరోనా కాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడడంతో ఆయనపై ప్రజలకు మమకారం పెరిగింది. దీనితో ఈ ఏడాది కూడా జగన్ కు విజయం ఖాయమని స్పష్టం అవుతోందని వైసీపీ వర్గాల ఇంటర్నల్ టాక్. అయితే.. కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలన ఆ ప్రభావం పార్టీ పేరు పై పడుతుండడంతో.. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్మూత్ వార్నింగ్ ఇచ్చారట. పనితీరు బాగోకుంటే మరో సారి పదవి కష్టమేనని చెప్పారట. సర్వేలు అనుకూలంగా వస్తుండడంతో సీఎం జగన్ కూడా మరింత పట్టు బిగించాలని భావిస్తున్నారట. ఇప్పటికే యాభై ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లు అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉంటూ గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్సెస్ చేసారు. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా ఎన్నికలకు సిద్ధం అవ్వాలని సీఎం జగన్ తన టీమ్ ను మోటివేట్ చేశారట.
ఇవి కూడా చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన నారా లోకేష్.. అంత భయం ఎందుకు అంటూ..?