Advertisement
వై నాట్ 175 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నినాదం గట్టిగా కష్టపడితే ఈ ఫిగర్ ని దాటడం పెద్ద కష్టం కాదని ఆయన శ్రేణుల్లో నూరిపోసారు. కానీ 11 స్థానాలకి పరిమితం చేశారు రిజల్ట్స్ చూసి స్వయంగా జగన్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ ఓటమికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి. ఆక్రమ కేసులు వేధింపులు మొదలు టీడీపీ వర్గీయాల వ్యాపారాలకు అడ్డంకులు సృష్టించడం ఇలా చాలా దెబ్బ కొట్టాయి.
Advertisement
స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది అప్పటిదాకా వైసీపీ స్వింగ్ లో ఉండగా బాబు అరెస్టుతో మొత్తం మారిపోయింది. అన్నింటిలోకి జగన్ చేసిన గోరు తప్పిదం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టడం. పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి చూడడం, నువ్వు సింగిల్ గా పోటీ చేయలేవు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు ఇలా ఎన్నో దుర్భాషలాడేవారు. సీఎం పార్టీ అధినేత హోదాలో ఉండి ఇలాంటివి తప్పు అని వారించాల్సింది పోయి జగన్ కూడా వేదికలపై పవన్ ను వ్యక్తిగతంగా దూషించారు.
Advertisement
Also read:
సభలు సమావేశాలకు ఆటంకాలు కలిగించారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కామెంట్స్ చేసారు. పవన్ సినిమాలకు అడ్డంకులు సృష్టించే క్రమంలో జగన్ టికెట్ రేట్లు తగ్గించి ఇండస్ట్రీ జోలికి వెళ్లారు అనడం నిజం అని అన్నారు. టికెట్ రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినా అదే జనానికి ఎక్కలేదు. సినిమా వాళ్ళవల్ల అందరికీ దూరమయ్యామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!