Advertisement
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేయబోతున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నానని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కూడా సంచలన ట్వీట్లు పెట్టి సోషల్ మీడియాలో అందర్నీ ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి బరిలోకి దిగుతానని రాంగోపాల్ వర్మ చెప్పారు అనుకోకుండా సడన్ గా తీసుకున్న నిర్ణయం తో రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
Advertisement
Advertisement
తన పోటీకి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన కొద్దిసేపటికే వర్మ కూడా పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మీద రాంగోపాల్ వర్మ పోటీకి దిగుతున్నారు అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ కూడా తన అభిప్రాయాలని చెప్తూ జనసేన పవన్ కళ్యాణ్ పరిమితులైన నిర్ణయాలని ఎండగట్టే రాంగోపాల్ వర్మ ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నాను అని చెప్పడం వలన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ కూడా రాంగోపాల్ వర్మ రాజకీయాల్లోకి వస్తానని కానీ అసలు రాజకీయాల్లో ఆసక్తి ఉందని కానీ చెప్పలేదు. పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.
ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే రాంగోపాల్ వర్మ ఎలా పోటీ చేస్తారు, రాంగోపాల్ వర్మ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అసలు టికెట్ ఇస్తారా, అసలు ఎలా పోటీ చేస్తారో అనే ప్రశ్నలు అందరిలో వచ్చాయి. అయితే రామ్ గాపాల్ వర్మ మాత్రం ఈ సమాధానాలు ఏమి చెప్పలేదు. ఎలాంటి ప్రస్తావన లేకుండా సడన్ డెసిషన్ అని పిఠాపురం నుండి బర్లోకి దిగుతున్నానని పోస్ట్ చేశారు ఊరికే సెటైరికల్ గా చేస్తే ఏం పర్వాలేదు. కానీ నిజంగా పోటీ చేస్తున్నారేమో అని అందరూ భయపడుతున్నారు. ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ గురూజీ మీరు రాజకీయాల్లోకి రావాలి అని వెల్కమ్ చెబుతున్నారు. సరైన స్థానాన్ని ఎంచుకున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!