Advertisement
శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి ఎలా అయ్యారు..? అసలు ఆ పేరు ఎలా వచ్చింది దాని వెనుక కథ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు, ఆయన అందరికీ సుపరిచితమే. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారు. 150 కి పైగా సినిమాల్లో నటించడ ఎంత గొప్ప విషయంలో కదా..? ఎన్టీఆర్ తర్వాత నెంబర్ వన్ స్థానాన్నికైవసం చేసుకున్నారు.
Advertisement
దశాబ్దాల పాటు అగ్ర హీరోగా కొనసాగించారు ఎవర్గ్రీన్ స్టార్ గా నిలిచిపోయారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్. నటులకు ఫాన్సీ నేమ్ ఉంటే బాగుంటుంది. జనాల్లోకి వెళ్లేలా ఈజీగా పలికేలా స్టైలిష్ గా ఉండాలి స్క్రీన్ మీద ఈ పేరు ఉంటే బాగోదు ఏం పెట్టుకోవాలని ఆలోచనలో పడ్డారు. చిరంజీవి శివశంకర్ ప్రసాద్ లలో ఒకటి తీసుకుందామంటే అప్పటికే ఉన్న నటుల పేర్లని తలపిస్తున్నట్లు ఉన్నాయి అందుకని ఆయన ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒక కల వచ్చిందట. సాధారణంగా కలలు గుర్తుండవు ఆ కల మాత్రం గుర్తుండిపోయింది అని చిరంజీవి చెప్పారు.
Advertisement
Also read:
కలలో చిరంజీవి రామాలయం గర్భగుడి ఎదుట పడుకునే ఉన్నారట ఐదేళ్ల పాప తన దగ్గరకు వచ్చి చిరంజీవి ఇక్కడ పడుకున్నావా లేచి వెళ్ళి పని చూసుకో అందట. ఆశ్చర్యపడిపోయారట చిరంజీవి. వెంటనే తన ఫ్రెండ్ వచ్చి చిరంజీవి రా వెళ్దాం అన్నాడట నా పేరు శివ శంకర్ వరప్రసాద్ అయితే అందరూ చిరంజీవి అని పిలుస్తున్నారు ఏంటి అని అనుకున్నారట. అది ఆయన కల అని తర్వాత అర్థమైంది తల్లికి విషయాన్ని చెప్పారు అప్పుడు ఆమె ఈ పేరు మీద పెట్టుకోమని చెప్పారట ఇలా చిరంజీవిగా తెర పైకి వచ్చారు ఇప్పుడు ఎంతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!