Advertisement
“ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి. ధూమపానం మీకే కాదు.. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా హాని కలిగిస్తుంది” అంటూ సినిమా ఆరంభంలో నో స్మోకింగ్ యాడ్ నీ మీరంతా చూసే ఉంటారు. ధూమపానం శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు ఈ అలవాటుని మానలేకపోతున్నారు. 29 % మంది యువకులు సిగరెట్లకి బానిసలుగా ఉన్న వారికి 35 నుంచి 45 వచ్చేసరికి ఊపిరితిత్తులు, గుండె జబ్బులకు గురవుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. సినిమా ముందు వచ్చే ఈ స్మోకింగ్ యాడ్ లో ఓ తండ్రి తన కూతురితో కలిసి టీవీ చూస్తూ ఉంటాడు.
Advertisement
Read also: ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Advertisement
అప్పుడు ఓ చేత్తో సిగరెట్ కాల్చితుండగా అతని కుమార్తె ఇబ్బందిగా అతని వైపు చూడడంతో వెంటనే అతడు సిగరెట్ ని పారేస్తాడు. ఈ యాడ్ లో మనం ఒక చిన్న విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటే.. ఈ యాడ్ ప్రారంభంలో ఆ చిన్నారి తండ్రి, కుమార్తె ఉన్నప్పుడు వెనుక భాగంలో తల్లి ఏదో పని చేస్తూ విచారంగా కనిపిస్తుంది. ఆ తరువాత చివరి సీన్ లో ఆమె నవ్వుతూ కనిపిస్తుంది. తన భర్త సిగరెట్ తాగుతున్నాడు అని మొదట ఆమె విచారమైన ముఖంతో కనిపించినప్పటికీ చివర్లో సిగరెట్ మానేసినందుకు ఆమె సంతోషిస్తూ తన కుటుంబంతో కలిసి నవ్వుతూ కనిపిస్తుంది.
ఇదే విషయాన్ని మనం ఆ యాడ్ లో గమనించొచ్చు. నిజానికి ఈ చిన్న విషయాన్ని ఎవరూ గమనించి ఉండరు. ఇందులో ఎంతో అర్థం ఉంది. కేవలం సిగరెట్ తాగే వారికే కాక వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పొగకు నాశనం చేస్తుంది. సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులను మానేశాక కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు అనే విషయాన్ని చెప్పేందుకు ఈ యాడ్ లో ఆయా సన్నివేశాలను పెట్టారు. కనుక పొగాకు ఉత్పత్తులను వాడడం మానేస్తే మంచిది. అది వారి ఆరోగ్యాలకే కాదు వారి కుటుంబాలకు కూడా మేలు చేస్తోంది.
Read also: “వీర సింహ రెడ్డి” హీరోయిన్ హనీ రోజ్ వయసు ఎంతో తెలుసా..? వామ్మో ఇది అస్సలు నమ్మలేరు ??