Advertisement
ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. అలా దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ సినిమా కథ, ఇంకా నటీనటులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం సినిమా చూస్తాం కాబట్టి ఈ పొరపాట్ల గురించి అంత పెద్దగా పట్టించుకోము. సినిమా విడుదలైనప్పుడు అలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోము కానీ.. ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమాను చూసినప్పుడు అందులో కొన్ని పొరపాట్లను గమనిస్తుంటాం.
Advertisement
Read also: అప్పుడు తొడ కొడితే ట్రైన్ వెనక్కి, ఇప్పుడు వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!
Advertisement
అలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా, సాక్షి శివానంద్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ చిత్రంలో పొరపాటు ఏంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ లో రోహిణిని ఇష్టపడతారు. రోహిణి చిరంజీవి గురువైన విజయ్ కుమార్ గారి కూతురు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలోని ఓ సందర్భంలో విజయ్ కుమార్ తో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు రోషిని విజయ్ కుమార్ తో కలిసి ఉన్న ఫోటోలను చూస్తారు.
ఈ రెండు ఫోటోలలో విజయ్ కుమార్, రోషిని ఆ పర్టికులర్ సీన్లో ఎలా అయితే ఉన్నారో ఫోటోలలో కూడా అలాగే కనిపిస్తారు. దాన్ని బట్టి ఆ ఫోటోలు అప్పుడే తీసినవి అని అర్థం అయిపోతాయి. ఇలా మనం చూసే చాలా సినిమాలలో పొరపాట్లు ఉండే ఉంటాయి. అసలు వీటిని పొరపాటు అనేది కూడా చాలా పెద్ద పదం ఏమో. వీటి వల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ.. ఎప్పుడైనా సినిమా చూసేటప్పుడు ఇది పొరపాటు ఏమో కదా అని అనిపిస్తుంది.
Read also: చిరంజీవి మాస్టర్ సినిమాలోని హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?