Advertisement
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప 2 తో పాటు పలు సినిమాల్లో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటుంది. తన అందానికి తగ్గట్టు హుందాతనాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాంటి రష్మిక తాజాగా తన అసిస్టెంట్ పెళ్లి వేడుకకు హాజరై వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. రష్మిక మందన్న తన అసిస్టెంట్ వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి వచ్చింది.
Advertisement
Advertisement
అయితే ఈ మ్యారేజ్ కి ఆమె ఒక ఆరెంజ్ కలర్ సారీలో చాలా సింపుల్ గా వెళ్ళింది. అయినప్పటికీ ఆ చీరలో కుందనపు బొమ్మలా చాలా క్యూట్ గా కనిపించింది. మరి ఆ మ్యారేజ్ లో రష్మిక చీర ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ చీరను ప్రముఖ డిజైనర్ అనిత డోగ్రీ డిజైన్ చేశారట. దీని ధర అక్షరాల 35 వేల రూపాయలు. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఖరీదు మాత్రం ఎక్కువగానే ఉందని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక రూ.100 చీర కట్టుకున్న చాలా అందంగానే ఉంటుందని.. అక్కడ అందంగా కనిపించేది చీర కాదని రష్మిక అని ఆమె అభిమానులు పొగిడేస్తున్నారు.