Advertisement
తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఎన్నిక అయ్యిన రాజకీయ నాయకులూ ప్రమాణ స్వీకారాలు చేసిన సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురు యంగ్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణిక రెడ్డి, పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి, మెదక్ జిల్లాకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఉన్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నిక అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇక, సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మార్క్ పాలనని ప్రారంభించారని చెప్పొచ్చు.
Advertisement
ఇప్పటికే కేబినెట్ భేటీ నిర్వహణ పూర్తి చేసిన రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా ఎదిగిన వ్యక్తుల గురించి చర్చ జరుగుతోంది. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఓడించిన యశస్విని రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆమె పాలకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో బీటెక్ చదివిన యశస్వినీ రెడ్డి వివాహం అయ్యాక అమెరికా వెళ్లిపోయారు. ఎటువంటి అనుభవం లేకున్నా.. ఆమె పాలకుర్తి లో పోటీ చేసి గెలిచారు. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పాలకుర్తి సహా ఇతర తెలంగాణా ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు చేసిన మరింత సేవలు అందించడం కోసం ఎమ్మెల్యే అవ్వాలి అన్న లక్ష్యంతో కాంగ్రెస్ లో చేరారు. అయితే.. భారత పౌరసత్వం లేకపోవడం అనేది ఆమెకు అడ్డంకి అవ్వడంతో ఆమె బదులు యశస్వినీ పోటీ చేసి విజయం సాధించారు.
Advertisement
మరో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి కూడా ఇదే కోవలోకి వస్తారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి 8 వేల ఓట్ల ఆధిక్యతతో బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆమె వయసు కేవలం ముప్పై సంవత్సరాలు. ఆమె ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ చదువుకుంటున్నారు. మాజీ మంత్రి డీకే అరుణకు మేనకోడలు పర్ణిక రెడ్డి. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వయసు కేవలం 26 . ఈయన మైనంపల్లి హన్మంతరావు కుమారుడు. రోహిత్ మేడ్చల్లోని మెడిసిటీ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసారు.
Read More:
రేవంత్ రెడ్డిపై కెసిఆర్ సర్కార్ కి ఇంత కక్ష ఉందా? రేవంత్ రెడ్డి పై అన్ని కేసులు పెట్టారా?
Maa Oori Polimera 2 OTT: Release Date and Platform Details When And Where To Watch the Movie
ఎన్నికల్లో అన్నగారిని ఓడించిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా ?