Advertisement
వైయస్ షర్మిల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. యెదుగూరి సందింటి షర్మిల రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు. భారతీయ రాజకీయవేత్త ఈమె. అలానే భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క యూనిట్ అయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈమె చెల్లెలు అని అందరికీ తెలిసిందే. 2012 జూన్ నుండి ఆంధ్రప్రదేశ్ లో తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో షర్మిల తల్లి వైయస్ విజయమ్మతో పాటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా పనిచేశారు. ఈమె ఉపఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 స్థానాలు ఒక పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సిపి గెలుచుకుంది.
Advertisement
షర్మిల 18 అక్టోబర్ 2012 కడప జిల్లాలోని ఇడుపులపాయలో మూడు వేల కిలోమీటర్లు పాద యాత్రని ప్రారంభించారు. ఆమె దానిని 4 ఆగస్టు, 2013 ఇచ్చాపురంలో పూర్తి చేయడం జరిగింది. పాదయాత్రలో భాగంగానే 14 జిల్లాలని పర్యటించారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి ఇది సమయం అని సూచిస్తూ షర్మిల బ్రాండెడ్ బస్సుల్లో బాయ్ బాయ్ బాబు టైమర్ క్లాక్ తో ఆంధ్రప్రదేశ్ మొత్తం 11 రోజులు బస్సు యాత్రను చేశారు. ఫిబ్రవరి 2021లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అయిన జగన్మోహన్ రెడ్డి తో రాజకీయ విభేదాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి లేదని షర్మిల పేర్కొన్నారు.
Advertisement
తెలంగాణలో 8 జూలై 2021న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని 9 ఏప్రిల్ 2021న షర్మిల అన్నారు. ఆమె అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 8జూలై 2021న వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. జనవరి 4, 2024న వైయస్సార్ తెలంగాణ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు.
ఐఎంసిలో వైయస్సార్సీపీ విలీనం తర్వాత షర్మిల ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనవరి 16న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా షర్మిల నియమితులయ్యారు. షర్మిల 1995లో అనిల్ కుమార్ ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు వీళ్ళకి. తన కొడుకు రాజారెడ్డికి నిశ్చితార్థం కూడా రీసెంట్ గానే జరిపించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!