Advertisement
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలైన రాజకీయ యుద్ధం క్రమంగా హైదరాబాద్ కు వ్యాపించి అల్లకల్లోలంగా మార్చింది. అరెస్టు అనంతరం బేయిల్ పై వచ్చిన వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల టిఆర్ఎస్ నేతలపై తీవ వాక్యాలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ రాజ్ భవన్ కు చేరుకుంది. అయితే, తమిళ సైని కలిసిన తర్వాత, తెలంగాణ, ఏపీ స్వరం ఎత్తుకున్నారు షర్మిల.
Advertisement
READ ALSO : ఏపీని వదిలేసి.. తెలంగాణకు వస్తున్న టీడీపీ నేతలు !
“మాట్లాడితే నేను ఆంధ్ర వ్యక్తినని అంటున్నారు. మరి కేటీఆర్ భార్య ఆంధ్రవాసి కాదా? కేటీఆర్ భార్యను గౌరవించినప్పుడు, నన్ను ఎందుకు గౌరవించరు. మీకో న్యాయం, మాకో న్యాయమా? మీరు చేస్తే సంసారం. పక్కనోడు చేస్తే వ్యభిచారమా? ఇదెక్కడి న్యాయమని అడుగుతున్నా. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే కొడుకును, బిడ్డను కన్నా. నా గతం ఇక్కడే, నా భవిష్యత్తు ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత” అని వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఆంధ్ర వారైతే విడాకులు ఇస్తారా..అని కేటీఆర్ ను నిలదీశారు వైఎస్ షర్మిల.
Advertisement
కెసిఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ కు పాల్పడితే, కొడుకు కేటీఆర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్నారని షర్మిల విమర్శించారు. దేశంలో అవినీతికి పాల్పడి ధనవంతులైన రాజకీయ కుటుంబం కేసిఆర్ దేనిని అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల ఇల్లు, ప్రగతి భవన్ లో తనిఖీలు చేస్తే లక్షల కోట్లు బయటపడతాయన్నారు. ఉద్యమకారుడు కదా అని అధికారం అప్పగిస్తే, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. దాడులు జరిగితే తమకు సంబంధం లేదంటూ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కవిత బెదిరిస్తున్నారని, వీళ్ళకు అసలు ప్రజాస్వామ్యం అంటే తెలుసా? అని ప్రశ్నించారు.
READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్ పదవి ఔట్ ?