Advertisement
Zebra Review: సత్యదేవ్, ప్రియ భవాని శంకర్, డాలీ ధనంజయ,జెన్నిఫర్ పిక్కినాటో, సునీల్, సత్యరాజ్, సత్య తదితరులు జీబ్రా సినిమాలో నటించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. బాల సుందరం, ఎస్.ఎన్. రెడ్డి, ఎస్ పద్మజ, దినేష్ సుందరం ఈ సినిమాను నిర్మించారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.
Advertisement
సినిమా: జీబ్రా
నటీ నటులు: సత్యదేవ్, ప్రియ భవాని శంకర్, డాలీ ధనంజయ,జెన్నిఫర్ పిక్కినాటో, సునీల్, సత్యరాజ్, సత్య దర్శకుడు: ఈశ్వర్ కార్తీక్
నిర్మాత: బాల సుందరం, ఎస్.ఎన్. రెడ్డి, ఎస్ పద్మజ, దినేష్ సుందరం
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్
రిలీజ్ డేట్ : నవంబర్ 22, 2024
కథ మరియు వివరణ:
బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా సూర్య (సత్య దేవ్) పని చేస్తాడు. స్వాతి (ప్రియా భవాని శంకర్) తో ప్రేమలో ఉంటాడు. స్వాతిని ఒక నాలుగు లక్షల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ నుంచి బయట పాడేయడానికి ఐదు కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ లో ఇరుక్కుంటాడు. స్టేట్ లోనే డేంజరస్ పర్సన్ ఆది తో ఢీ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఐదు కోట్ల రూపాయల సమస్యలో ఎలా ఇరుక్కున్నాడు..? సూర్య లైఫ్ లోకి ఆది ఎందుకు వచ్చాడు ఈ సమస్య నుంచి బయటపడ్డాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
Advertisement
ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ విషయానికి వచ్చేస్తే సత్యదేవ్ పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంది. డాలి ధనుంజయ్ అయితే అద్భుతంగా నటించాడు. డాలీ మంచి నటుడు అన్న విషయం చాలామందికి తెలియదు. పుష్పా లో సైడ్ విలన్ గా కనపడ్డాడు. ఈ సినిమాలో హీరో కంటే పవర్ఫుల్ పాత్రలో కనపడ్డాడు ఒక్కోసారి సినిమాలో హీరో డాలి ఏమో అని అనిపించే విధంగా ఉంది. ఆయన ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సత్యదేవ్ కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా నటించాడు. కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది. సత్యరాజ్ టైమింగ్ తో మంచిగా ఎంటర్టైన్ చేశారు.
సునీల్ కాస్త డిఫరెంట్ పాత్ర చేశారు. సంగీతం సినిమాకి ప్లస్ అయింది సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది ఎడిటింగ్ పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ మొదటి సినిమా పెంగ్విన్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని జాగ్రత్తగా చూసుకుని జీబ్రా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రీన్ ప్లే ని అద్భుతంగా నడిపించారు. బ్యాంకుల్లో జరిగే ఫ్రాడ్స్ గురించి క్లారిటీగా చెప్పాలి కానీ పై పైన చెప్తూ సినిమాని తీసేసారు క్లారిటీ ఇవ్వలేదు. 100 కోట్ల రూపాయల సమస్య నుంచి ఒక్క ఈమెయిల్ తో ఎలా తప్పించుకున్నాడు వంటి ప్రశ్నలకి ఆన్సర్లు లేవు.
ప్లస్ పాయింట్స్
కథ
నటీ నటులు
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ కొన్ని సీన్స్
కథలో మెయిన్ పాయింట్ కి లాజిక్ లేకపోవడం
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!