Advertisement
చాలామంది విద్యార్థులు ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నారు. చాలామంది సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ సాధ్యం కాదు. ఎన్నో అవరాధాలు ఎదురైనా వాటిని అధిగమించి తీవ్ర స్థాయిలో శ్రమిస్తేనే లక్ష్యాలని చేరుకోవడానికి అవుతుంది. జోయా మీర్జా అనే యువతి కన్న కలల్ని నెరవేర్చడంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఎన్నో సార్లు విఫలమైనా కృంగిపోలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నమే ఆమెని గెలిచేలా చేశాయి. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్ గా ఎంపికైన జోయా మీర్జా ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు.
Advertisement
వైద్యురాలుగా సేవలు అందించి సైన్యంలో పనిచేయాలని కలలు కన్నారు. ఆర్థిక ఇబ్బందులు వలన కలలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. నీట్ పరీక్షలో కూడా ఆమె ఫెయిల్ అయ్యారు. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఆమెను చదివించారు. ఒకే ఒక ర్యాంక్ తేడాతో సీట్ కోల్పోయారు. ఆమెకి ఫెయిల్యూర్ ఎవరైనా కుటుంబ సభ్యులు మాత్రం తమ వంతు సహాయాన్ని అందించారు.
Advertisement
కోచింగ్ సెంటర్లో చేరి నీట్ పరీక్షలో సక్సెస్ అందుకున్నారు. ఎంబిబిఎస్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ నేను డాక్టర్ గా పని చేస్తున్నారు. గెలుపులో ఫెయిల్యూర్స్ కూడా భాగమని వాటిని పట్టించుకోకుండా కష్టపడితే లైఫ్ లో అనుకున్నది సాధించవచ్చు అని ఆమె కథను చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. పైగా ఆమెని ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా సరే లైఫ్ లో గెలవచ్చు అని అంటున్నారు. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన జీవితంలో కూడా ముందుకు వెళ్తే అనుకున్నది కచ్చితంగా ఏదో ఒక రోజు సాధిస్తాము మంచి పొజిషన్లో ఉంటాము.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!