Advertisement
ముకేశ్ అంబానీ గురించి పరిచయం చేయక్కర్లేదు. ముఖేష్ అంబానీ అపర కుబేరుడు తన వద్ద ఎంత సంపద ఉన్నా కూడా దాన్ని ఇంకా పెంచడం ఆయనకి ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలతో మార్కెట్ని షాక్ చేస్తూ ఉంటారు. ముకేశ్ అంబానీ కొడుకులు కోడళ్ళు వచ్చిన తర్వాత జోరు ఇంకాస్త పెరిగింది ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి అంబానీ కి ఇన్ డైరెక్ట్ గా ఏదో ఒక రూపంలో డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. అంబానీ కొడుకు పెళ్లి అంటే ఎలా ఉంటుంది..? అంబానీ కొడుకు పెళ్లి ని ఓ రేంజ్ లో చేస్తారు. ఆ విషయం గురించి కొత్తగా మనం చెప్పక్కర్లేదు.
Advertisement
దేశంలో సెలబ్రిటీలు పెద్ద పెద్ద స్టార్లు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ పెళ్లికి హాజరవుతారు. ఆయన రేంజ్ కి అక్కడ ఎలాంటి వంటకాలు పెడతారు..? ఊహిస్తేనే ఎంత ఖర్చు పెడతారో అర్థం అయిపోయి ఉంటుంది. ఆ ఊహకి ఏమాత్రం తగ్గకుండా వంటకాలను ప్లాన్ చేశారు అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న జరగబోతోంది. మార్చి ఒకటి, రెండు, మూడు తేదీల్లో గుజరాత్ లో జాంనగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేయబోతున్నారు. రాధిక మర్చంట్ తో అనంత అంబానీ పెళ్లి జరగబోతోంది.
Advertisement
దీనికోసం 100 కాదు 200 కాదు ఏకంగా 2,500 వంటకాలనీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది 25 నుండి 30 మంది బెస్ట్ షెఫ్ లను నియమించారు. బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాల వంటకాలని సిద్ధం చేయించారు. లంచ్ కోసం 250 రకాలు డిన్నర్ కోసం 250 రకాలు మెనూలో ఉండబోతున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు ఈ వెడ్డింగ్ సాగిపోతుంది. ఏ ఒక్క వంటకం రిపీట్ కాకుండా మెనూని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మిడ్ నైట్ స్నాక్ కౌంటర్ మూడు రోజులు పాటు హైలైట్ గా ఉండబోతోంది. గెస్ట్లు అంతా ఎక్కువ నైట్ లైఫ్ కి అలవాటు పడిపోయారు కనుక ఆ టైంలో బెస్ట్ ఫుడ్ ఉండాలని అంబానీ ఆలోచించారట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!