Advertisement
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన తాజా యాక్షన్-డ్రామా యానిమల్ విడుదలైన తర్వాత భారతీయ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లోని ప్రధాన పాత్రలు ఎక్కువగా పోకిరీలు, హింసాత్మకమైనవి మరియు స్త్రీద్వేషపూరితమైనవిగా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు ఎక్కువగా వివాదాస్పదం అవుతూ ఉంటాయి. అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ నుండి అతని తాజా విడుదల యానిమల్ వరకు, అతని సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రెండు రోజుల్లో యానిమల్ రూ.129.80 కోట్లు వసూలు చేసింది. కానీ వివాదాలు మాత్రం షరా మాములే అన్నట్లు ఉన్నాయి. యానిమల్ సినిమా వివాదంలోకి చిక్కుకోవడానికి గల తొమ్మిది కారణాలను ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. ‘ఆల్ఫా మగ’ సిద్ధాంతం
సినిమా యొక్క ఒక సన్నివేశంలో, రణబీర్ రష్మికకి ఏది తప్పు మరియు సరైనది అని వివరిస్తాడు. మరియు అతను ‘ఆల్ఫా మేల్’ అయినందున ఆమె అతన్ని ఎందుకు ఎంచుకోవాలో వివరిస్తాడు. ఇది అంత యాక్సెప్ట్ చెయ్యాలని అనిపించదు.
2. ఆల్ఫాల సంఘర్షణ
ఈ సినిమాలో ఆడ, మగ జెండర్ల మధ్య ఉన్న సంఘర్షణ కూడా అంతర్లీనంగా కనిపిస్తుంది. మహిళలు పిల్లల్ని కనడానికి, పెంచడానికే ఉంటారని.. తద్వారా వారసత్వం కొనసాగుతుంది అన్న కాన్సెప్ట్ కూడా అందరికి నచ్చదు.
3. రక్తపాతం:
యానిమల్ మాస్ యాక్షన్ చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అయితే, సినిమాలో చూపించిన హింస స్థాయి అందరి అంచనాలను మించిపోయింది. రణబీర్ తండ్రి అనిల్ కపూర్ కోసం సినిమాలో చాలా అనవసరమైన రక్తపాతం ఉందని అనిపిస్తుంది.
4. స్త్రీ ద్వేషం
అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన యానిమల్ సినిమా కూడా స్త్రీని ద్వేషించే చిత్రమే.
Advertisement
5. విషపూరితమైన మగతనం
ఈ చిత్రంలో ప్రధాన నటుడు రణబీర్ విషపూరితమైన మగతనం యొక్క లక్షణాలను ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో ప్రదర్శిస్తాడు. రష్మిక మందన్న పోషించిన “గీతాంజలి” పాత్రని మాత్రం విధేయత, వినమ్రత ఉన్న భార్యగా చూపారు.
6. మోసాన్ని సమర్థించడం
రణబీర్ పాత్ర ‘రణ్విజయ్ సింగ్’ రష్మిక పాత్రను వివాహం చేసుకున్నప్పటికీ మరో మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాడు. దాన్ని అతను సమర్ధించుకుంటాడు కూడా. తన తండ్రిపై దాడి చేసిన వారిని బహిర్గతం చేయడం కోసమే ఇలా చేసానని చెప్పుకుంటాడు. కానీ అందుకు వేరే ప్లాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
7. మళ్లీ పెళ్లి చేసుకోవద్దు
రణబీర్ యాక్షన్-ప్యాక్డ్ మూవీలో తన బద్ధ శత్రువు అబ్రార్తో పోరాడటానికి బయలుదేరబోతున్నప్పుడు తన భార్యతో.. ఒకవేళ నేను తిరిగి రాకపోతే.. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు అని చెబుతాడు. ఇది నియంతృత్వాన్ని చూపిస్తున్నట్లు అనిపిస్తుంది.
8. విస్కీ, వైన్ కాదు
ఒక సన్నివేశంలో, రణబీర్ పాత్ర అతను తన సోదరి విస్కీ తాగడం చూసినప్పుడు, అతను తన సోదరి వద్దకు వచ్చి “విస్కీ ఎందుకు తాగుతున్నావు? ద్రాక్ష రసం తాగు..” అంటూ చెబుతాడు. ఈ సన్నివేశం అతను ఎంత ఆధిపత్యం మరియు స్త్రీ ద్వేషంతో ఉంటాడో చూపిస్తుంది.
9. ఎక్కువ రన్ టైం ఉండడం..
ఈ సినిమా నిడివి 3 గంటల 22 నిమిషాలు. ఇంత లెన్తీ సినిమాలో ఎక్కువ హింసాత్మక సన్నివేశాలు చూడాల్సి రావడంతో ప్రేక్షకుల మెదడుకి అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది.
Read More:
మిచౌంగ్ తుఫాన్ అని ఎవరు పేరు పెట్టారు..? ఇండియా లో వచ్చిన తుఫాన్ల పేర్లు ఇవే..!