Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా తో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టి తాజాగా అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ రామ్ తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే పటాస్,118, బింబిసారా లాంటి సినిమాలు మాత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లో స్పెషల్ గా నిలిచిపోతాయి.
Advertisement
కట్ చేస్తే.. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య స్వాతి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిది పెద్దలు కుదిరిచిన వివాహం. 2006 ఏప్రిల్ లో కళ్యాణ్‌రామ్ స్వాతి వివాహం జరిగింది. అయితే స్వాతికి మరియు బాలకృష్ణ భార్య వసుంధరకు దగ్గర రిలేషన్ ఉందట. స్వాతి తండ్రికి ఫార్మా ఎలక్ట్రికల్ కంపెనీలు ఉన్నాయి. ఆమె చెన్నైలో మెడిసిన్ పూర్తి చేసింది. స్వాతి వాళ్ళ కుటుంబానికి మరియు హరికృష్ణ కుటుంబానికి దూర బంధుత్వం ఉందట. అయితే కళ్యాణ్ రామ్ కు పెళ్లి చేయాలని హరికృష్ణ ఆయన భార్య లక్ష్మి నిర్ణయం తీసుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ కొద్దిరోజులు ఆగాలని కండిషన్ పెట్టారట.
Advertisement
Read Also: Tollywood Cinema News, Telugu News
తల్లి లక్ష్మీ మాత్రం ఒప్పుకోలేదు. కళ్యాణ్ కు వెంటనే పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకొని ఒత్తిడి తెచ్చింది. దీంతో తల్లి కోరిక మేరకు కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడట. అయితే పెళ్లి తర్వాత స్వాతిని ఎమ్మెస్ చేయించాలని హరికృష్ణ కోరిక ఉండేది. ఆ కోరికను స్వాతితో తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ స్వాతి మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఇష్టం ఉందని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశారు. స్వాతి అప్పటినుంచి కళ్యాణ్ రామ్ సినిమాల విషయం లో అలాగే వ్యాపారాలను చూసుకుంటూ వస్తుంది.
also read: