Advertisement
సమాజంలో రోజురోజుకీ మహిళలపై వేధింపులు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అవాంఛనీయ, హింసాత్మక ఘటనల గురించి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇల్లు, ఆఫీస్, గుడి, బడి, రోడ్డు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఏదో ఒక మూల మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. లింగ అసమానతకు ముగింపు పలికినప్పుడే మహిళపై హింస తగ్గుతుందని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. సీరియల్ కిల్లర్స్ గురించి వినే ఉంటారు. కానీ బీహార్ లో సీరియల్ కిస్సర్ కలకలం రేపుతున్నాడు. అమ్మాయిలే వాడి టార్గెట్. ఒంటరిగా దొరికితే చాలు పండగ చేసుకుంటున్నాడు.
Advertisement
Read also: ఆస్కార్ అవార్డు ని నిజంగా అమ్ముకోవచ్చా ?? ఆలా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
Advertisement
ఎక్కడినుండి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. సడన్ గా వెనక నుండి వస్తాడు. గట్టిగా పట్టుకుంటాడు. బలవంతంగా పెదాలపై ముద్దు పెడతాడు. తేరుకునే లోపే అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. బీహార్ లో ఓ సీరియల్ కిస్సర్ వ్యవహారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని జమై సదర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఫోన్ మాట్లాడుతూ రోడ్డుమీదకి వచ్చి నిల్చుంది. ఇంతలో గుర్తుతెలియని ఓ కుర్రాడు ఆసుపత్రి కూడా దూకి వెనుక నుంచి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముందుకు వెళ్లి గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.
ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ షాక్ కి గురైంది. ఆమె తేరుకునే లోపే అక్కడి నుండి ఆ కుర్రాడు జంప్ అయ్యాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మహిళలు ఒంటరిగా రోడ్డు మీదకి రావాలంటేనే భయపడిపోతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read also: TOLLYWOOD ACTRESS LAYA: ముకేశ్ అంబానీకి హీరోయిన్ లయ బంధువా ?