Advertisement
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో బ్రూస్ లీ ఒకరు. ఆసియా మార్షల్ ఆర్ట్స్‌ను పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం పొందేలా చేసిన ఘనత బ్రూస్ లీది. పోరాట క్రీడల్లో ఓ విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి బ్రూస్ లీ. ఆయన వర్క్ అవుట్ రొటీన్ ఎలా ఉంటుందో.. అంత ఫిట్ గా ఉండడానికి ఆయన ఎలాంటి రొటీన్ ఫాలో అయ్యేవారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Advertisement
ఆయన అభిమానులు ఆయన్ను లీ అని పిలుచుకుంటారు. ఆయన తన శిక్షణతో నిజంగానే లెజెండ్ స్థానానికి చేరారు. పోరాటాల విషయానికి వస్తే.. నిజంగా లీ తరువాత మరియు లీ ముందు ప్రపంచం అని చెప్పుకోగలిగేలా బ్రూస్ లీ కష్టపడ్డారు. బ్రూస్ లీ తన పోరాట సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం జీత్ కునే దో అనే కళని సృష్టించారు. దీనిని ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనిని బ్రూస్ లీ 1967లో సృష్టించారు. ఇది కుంగ్ ఫూ యొక్క “నిరాకార” రూపం. మీ ప్రత్యర్థి దాడి చేయడానికి ముందు దాడి చేయాలనే వింగ్ చున్ ఆలోచన నుంచి ఈ కళ ప్రేరేపించబడింది.
Advertisement
ఆ కాలంలోని యుద్ధ కళలు వాటి మార్గాల్లో చాలా దృఢంగా మారాయని మరియు నిజమైన యుద్ధ కళలు సహజంగా, ఈజీగా ఉండేవని బ్రూస్ లీ నమ్మేవారు. ఆయన రోజువారీ జీవితంలో కఠినమైన శిక్షణ తీసుకునేవారు. ఆయన వర్క్ అవుట్ రొటీన్ లో ఏమేమి ఎక్సర్సైజ్ లు ఎన్నెన్ని సార్లు చేసేవారో ఇప్పుడు తెలుసుకోండి.
స్క్వాట్స్- 3 సెట్లు- 10 సార్లు
ఫ్రెంచ్ ప్రెస్ 1 – 4 సెట్స్ – 6 సార్లు
ఇంక్లైన్ కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
ఫ్రెంచ్ ప్రెస్ 2- 4 సెట్స్ – 6 సార్లు
“కాన్” కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
పుష్ అప్ – 3 సెట్స్ – 10 సార్లు
రెండు చేతి కర్ల్ – 3 సెట్స్ – 8 సార్లు
ట్రైసెప్ స్ట్రెట్ – 3 సెట్స్ – 8 సార్లు
“కాన్” కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
డంబెల్ సర్కిల్ – 4 సెట్స్ – infinity
రివర్స్ కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
తాంబాల్ సర్కిల్ మణికట్టు కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
మణికట్టు కర్ల్ – 4 సెట్స్ – 6 సార్లు
కాఫ్ రైజ్ – 5 సెట్స్ – 20 సార్లు
ఈ డీటెయిల్స్ తో కూడిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇవి బ్రూస్ లీ వర్క్ అవుట్ ప్రాక్టీస్ చేసిన సమయంలో నోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇండెక్స్ 1965 వ సంవత్సరంలోనిదిగా తెలుస్తోంది.
మరిన్ని..