Advertisement
భార్యా భర్తలు అన్నాక ఎన్నో విషయాలకు సర్దుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో గొడవలు వస్తుండడం సహజం అయితే.. చాలా మంది గొడవలు పడుతున్న సమయంలో మరింత రెచ్చి పోయి మాట మాట అనేసుకుంటూ ఉంటారు. దీని వలన ఆ గొడవ మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం అయితే ఉండదు. కోపంలో మాట్లాడే మాటల వల్ల లేదా చేతల వలన ఏర్పడే నష్టాలే ఎక్కువ. గొడవలు పడుతున్న సమయంలో చెయ్యకూడని తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
చాలా మంది కోపంలో వస్తువులను విసిరేస్తారు. మీరు ఎంతో డబ్బు పెట్టి కొన్న వస్తువులను కోపంలో విసిరేసినా ఆ తరువాత బాధ పడతారు. అందుకే ఇలాంటి పనులు ఎంత కోపంలో ఉన్నా చెయ్యకండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నించండి. ఇలా పగలగొట్టే వస్తువులలో ముందు ఫోన్ ఉంటుంది. చాలా మంది ఫోన్స్ ని పగలగొట్టేస్తూ ఉంటారు. ఇవి ఖరీదైనవే. కోపంలో పగలగొట్టినా తరువాత బాధపడతారు. అందుకే ఈ విసిరేయడం, పగలగొట్టడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి.
Advertisement
కోపం కాసేపు ఉండి తరువాత పోతుంది. కానీ ఆ కోపంలో మీరు అన్న మాటలు మాత్రం వెనక్కి తీసుకోలేరు. అవి అవతలి వారిని చాలా బాధపెడతాయి. అవి వారి మనసులోంచి పోవు. మీ మధ్య చెరపలేనంత దూరాన్ని తీసుకొస్తాయి. అందుకే మాటలను అనేటప్పుడు ఆచి తూచి ఉండండి. కొంతమంది కోపం ఎక్కువైతే శారీరకంగా హింసిస్తారు. కొట్టడం, దూరంగా తొయ్యడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల వారికి దెబ్బలు తగలడమే కాకుండా.. మీక్కూడా చాలా సమస్యలే వస్తాయి. అందుకే ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. మరికొందరు కోపంలో ఇతరులు చెప్పే మాటలను వినిపించుకోరు. దీనివలన కూడా చాల సమస్యలు వస్తాయి. అందుకే ఎంత కోపంలో ఉన్నప్పటికీ అవతలి వ్యక్తులు చెప్పే మాటలను వినాలి.
మరిన్ని..
చంద్రబాబు గారు విడుదల అవ్వాలంటే చివరగా మిగిలింది ఈ ఒక్క మార్గమేనా ? రంగం లోకి..!
70 ఏళ్ల బామ్మతో 35 ఏళ్ల యువకుడి ప్రేమ.. పెళ్లి కూడా చేసుకున్నారు.. వీరి లవ్ స్టోరీ ఏంటంటే?
మీకు ఇలాంటి కలలు వస్తే పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పకండి.. ఎందుకంటే?