Advertisement
Devil Movie Review : కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ మూవీ ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. సౌందర్ రాజన్.ఎస్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. డిసెంబర్ 29, 2023 ఇది రిలీజ్ కానుంది.
Advertisement
Devil Movie Review
- నటీ నటులు: కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య
- దర్శకుడు: నవీన్ మేడారం
- నిర్మాత: అభిషేక్ నామా
- సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
- సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
- విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023
Devil Movie కథ మరియు వివరణ:
కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్టు కొడతారని కళ్యాణ్ రామ్ అభిమానులు అనుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తోంది. బింబిసారా తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తో ఆమెకి రెండవ సినిమా బింబిసారం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ స్పీడుగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలు మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. చివరగా కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ సినిమా షాక్ ఇచ్చింది. బోల్తా కొట్టేసింది.
కానీ ఈసారి మాత్రం ఈ సినిమా సక్సెస్ అవుతుందని నందమూరి అభిమానులు అంటున్నారు. బ్రిటిష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనపడబోతున్నారు ఈ సినిమా ట్రైలర్ తో ఒక్క సరిగా సినిమా మీద అంచనాలని పెంచేశారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయట. అలానే విజువల్స్, సంయుక్త పాత్ర, ప్రొడక్షన్ క్వాలిటీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని సినిమా సూపర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
Advertisement
సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది దాంతో సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఈ సినిమాకి రెండు గంటల 36 నిమిషాల నిడివి లాక్ చేసింది. డెవిల్ చిత్రానికి సెన్సార్ సభ్యులు నుండి రెస్పాన్స్ బాగా వచ్చింది.
ఈ సినిమా బాగుందని అభినందించారట ఇందులో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్ యాక్షన్ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అలానే మూవీలో సీన్స్ సర్ప్రైజ్ గా ఉంటాయట. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ కి ఈ మూవీ సక్సెస్ ఇస్తుందని అంత చూస్తున్నారు బ్రిటిష్ కాలంలో జరిగే ఫిక్షనల్ స్టోరీ కనుక సహజంగానే కాస్త ఆసక్తిగా ఉంటుంది ఆడియన్స్ ని బాగా అలరించే కథ కథనాలు ఉంటే సూపర్ హిట్ ఖచ్చితంగా వస్తుంది.
కథను చూస్తే.. భారతదేశంలో బ్రిటిష్ పాలనా నేపథ్యంలో జరిగిన స్టోరీ. జమీందారు కుటుంబంలో జరిగిన హ$త్య ఎవరు చేశారో తెలుసుకోవడానికి డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్ ) వస్తాడు. సీక్రెట్ ఏజెంట్ డెవిల్ అసలు ఎందుకు అక్కడకి రావాలి..? ఆ బంగ్లాలో ఉంటున్న నైషధ (సంయుక్త మీనన్) అసలు ఎవరు.. ?, ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు…? అలానే నైషధ కి నేతాజీకి ఉన్న లింక్ ఏమిటి ? ఇవన్నీ సినిమా చూస్తే తెలుస్తుంది. యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ బాగా నటించాడు. ఈ సినిమాలో లుక్స్ అలానే ఫ్రెష్ నెస్ బాగున్నాయి. ఈ మూవీలో త్రివర్ణ పాత్రకు సంబంధించి ట్విస్ట్ అదిరిపోయింది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. సంయుక్త మీనన్ కూడా బాగా నటించింది. మాళవిక నాయర్ కూడా నటనతో ఆకట్టుకుంది. విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగా నటించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బావున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
ట్విస్టులు
కథ
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
వర్క్ అవుట్ అవ్వని ఎమోషన్స్
కీలక సన్నివేశాలు స్లోగా సాగడం
రేటింగ్: 3/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!