Advertisement
మన దేశంలో చాలా మంది రైళ్లలోనే ప్రయాణాలు చేస్తారు. దీనికి ముఖ్య కారణం ఇండియాలో రైల్వే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండటం. విస్తృతమైన రవాణా నెట్వర్క్ భారత్ సొంతం. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? దేశంలో కొన్ని రైల్వే స్టే షన్లను సెంట్రల్ అని మరికొన్ని స్టేషన్లనేమో జంక్షన్ అని పిలుస్తున్నారు. ఇలా ఎందుకు పిలుస్తున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?
#సెంట్రల్
ప్రాథమికంగా భారత్లో నాలుగు రకాల స్టేషన్లో ఉన్నాయి. సెంట్రల్, టెర్మినస్, జంక్షన్ మరియు స్టేషన్. ఒకే నగరంలోని చాలా స్టేషన్ లు ఉండి, వాటిలో అతి ముఖ్యమైన/ రద్దీగా ఉండే స్టేషన్ అయినప్పుడు స్టేషన్ ను సెంట్రల్ అంటారు. ఒక సెంట్రల్ సాధారణంగా చాలా పెద్దది మరియు రోజు చాలా రైళ్లు దాని మీదుగా వెళతాయి. నగరంలో ఒకటికంటే ఎక్కువ స్టేషన్లు ఉంటే సెంట్రల్ స్టేషన్ కలిగి ఉండడం అవసరం లేదు. చాలాకాలం కిందటే ఈ స్టేషన్లను ప్రారంభించారు. మన దేశంలో అలాంటి సెంట్రల్ లు ఐదు ఉన్నాయి. అవి కాన్పూర్ సెంట్రల్, మంగళూరు సెంట్రల్, ముంబై సెంట్రల్, త్రివేండ్రం సెంట్రల్, చెన్నై సెంట్రల్.
Advertisement
#టెర్మినస్
ఏ స్టేషన్లో అయినా రైల్వే ట్రాక్స్ ముగిసిపోతే అలాంటి స్టేషన్లను టెర్మినస్ స్టేషన్స్ అని పిలుస్తారు. ఇలాంటి స్టేషన్లలో రైళ్లు ఒకే దిశలో బయలుదేరుతాయి. భారత్ లో బాంద్రా టెర్మినస్(BDTS), హౌరా టెర్మినస్(HWH), బావునగర్ టెర్మినస్(BVC), చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(CSMT), కొచ్చిన్ హార్బర్ టెర్మినస్(CHTS), లోక్మాన్య తిలక్ టెర్మినస్(LTT), యావత్మల్ టెర్మినస్(YTL) లు ముఖ్యమైనవి.
#జంక్షన్
ఏ స్టేషన్ నుంచి అయినా కనీసం 3 మార్గాలు ఉంటే ఆ స్టేషన్ ను జంక్షన్ అంటారు. వచ్చే రైళ్లకు కనీసం 2 మార్గాలు ఉండాలి, అప్పుడు స్టేషన్ ను జంక్షన్ అంటారు. సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ లను జంక్షన్ అనే పిలుస్తారు. అలాగే రైళ్లు ఆగి, ప్యాసింజర్లు తమ వస్తువులు తీసుకెళ్లగలిగే ప్రదేశాన్ని స్టేషన్ అని పిలుస్తాము. ఇక్కడ సాధారణంగా రైళ్లు ఆగడానికి, వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?