Advertisement
రామ్ గోపాల్ వర్మ, చిరంజీవితో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ అనుకోకుండా ఆ చిత్రం ఆగిపోయింది. అప్పట్లో వర్మ అగ్ర దర్శకుడు. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే నెక్స్ట్ రేంజ్ అంతే. దీనికి వినాలని ఉంది అంటూ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా కొన్ని రోజులు చేశాడు వర్మ.
Advertisement
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?
ఉన్నట్లుండి చిరంజీవి సినిమాను ఆపేశాడు వర్మ. దానికి కారణాలు కూడా ఆయన చెప్పలేదు. అడిగితే తనకు బాలీవుడ్ లో కమిట్మెంట్ ఉంది. అందుకే వెళ్లిపోయానని చెప్పాడు. నిజానికి చిరుతో వర్మ సినిమా మొదలుపెట్టే సమయానికి సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో జైల్లో ఉన్నాడు. కానీ ఆయనతో ఓ సినిమా కమిట్మెంట్ ఉంది వర్మాకు. కానీ జైల్లో ఉండటంతో ఆలోపు చిరుతో సినిమా స్టార్ట్ చేశాడు. కానీ అంతలో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యాడు. దాంతో షూటింగ్ జరుగుతున్న చిరు సినిమాను ఆపేసి బాలీవుడ్ వెళ్ళిపోయాడు వర్మ. చిరంజీవి సినిమా ఆగిపోవడానికి వర్మ చెప్పిన కథ ఇది.
Advertisement
అప్పట్లో క్షమాపణ కోరుతూ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆర్జీవి. అయితే మరో కథ కూడా ఉంది. షూటింగ్ మొదలైన కొన్ని రోజుల తర్వాత స్క్రిప్ట్ విషయంలో చిరుకి అనుమానాలు రావడం, వాటిని కొంత మార్చాలని చిరు కోరడంతో వర్మాకు నచ్చలేదు. ఎవరు చెప్పిన వినే మనిషి కాదాయే. అందుకే మధ్యలోనే ఆ చిత్రం ఆగిపోయింది. అప్పట్లో ఈ విషయంపై చాలా వార్తలు వచ్చాయి. అప్పటినుంచి వర్మతో చిరుకు అంతర్గతంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో టబు కథానాయక. ఊర్మిళ మరో హీరోయిన్. ఈమెతో పాట కూడా విడుదలైంది. అశ్విని దత్ దీనికి నిర్మాత. ఈ సినిమా కోసం మన శర్మ స్వరపరిచిన పాటలనే గుణశేఖర్ చూడాలని ఉంది లో వాడుకున్నారు. మొత్తానికి అప్పట్లో ఓ సంచలన కాంబినేషన్ అలా మిస్ అయిపోయింది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?