Ads
ఈ కాలంలో అమ్మాయిలు తమ పెళ్లి విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. తాను కోరుకునే లక్షణాలు ఉన్న అబ్బాయి దొరికేంతవరకు వేచి చూస్తున్నారు. అయితే చాణక్య నీతి ప్రకారం ఆ అమ్మాయికి మూడు పదుల వయసు దాటిన ఆమె చేసుకోబోయే అబ్బాయి చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో మరియు వివేకం విషయంలో వారికి సరి సమానమైన లేదా అంతకంటే హై స్థాయిలో ఉండే అబ్బాయి కోసం ఎదురుచూస్తున్నారు తప్ప ఎక్కడ రాజీ పడటం లేదు. అయితే ఒక అబ్బాయిలో అమ్మాయి కోరుకునే లక్షణాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
ఆత్మవిశ్వాసం లేని అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. మనసులో మాట కూడా చెప్పలేని అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. అలాంటి అబ్బాయిలు జీవితాంతం బాధపడతారు. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేని వ్యక్తులను అమ్మాయిలు ఇష్టపడరు.
Advertisement
అమ్మాయిలు ఫిట్నెస్ గా ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. తను ప్రేమించే వ్యక్తి శరీర ఆకృతి బాగుండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయిలలో ఇలాంటి లక్షణాలను గమనిస్తారు.
అమ్మాయిలు ఎప్పుడు చురుకైన వ్యక్తులను ఇష్టపడతారు. ఆడపిల్లలకు స్వతహాగా పరిశుభ్రత అంటే ఇష్టం. ఇందుకోసం ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. శుభ్రత పాటించే అబ్బాయితో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు స్నానం చేయకపోయినా, షేవింగ్ చేసుకోకపోయినా, పళ్ళు శుభ్రంగా లేకున్నా, బట్టలు మురికిగా ఉన్న వారు సహించలేరు. దీనివల్ల రిలేషన్ షిప్ ముందుకు వెళ్ళదు.
పెద్దలపట్ల గౌరవం, స్త్రీలను గౌరవించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. దీని వెనుక కారణం ఏంటంటే, ఇతరులను ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి తనను కూడా బాగా గౌరవిస్తాడని, మంచిగా చూసుకుంటాడని అమ్మాయి భావిస్తుంది.
Read also : Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు అక్టోబర్ 30 నుంచి 5 నవంబర్ 2022 వరకు