• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » పెళ్లయిన నాలుగు నెలలకే ప్రియుడితో పరార్.. కానీ చివరకు..!!

పెళ్లయిన నాలుగు నెలలకే ప్రియుడితో పరార్.. కానీ చివరకు..!!

Published on December 25, 2022 by karthik

Advertisement

ఈ రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లికి ముందు ప్రేమలో పడడం సర్వసాధారణం అయిపోయింది. పెద్దలు అంగీకరించకపోయినా పారిపోయి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ప్రేమించుకోవడంలో తప్పులేదు కానీ.. పెళ్లయిన తర్వాత మాత్రం మనసు మార్చుకొని భర్తతో కుదురుగా కాపురం చేసుకోవాలి. కానీ ప్రేమించిన వారిని మర్చిపోలేక పెళ్లయిన నాలుగు నెలలకే భర్తను వదిలేసి ప్రియుడుతో వెళ్లిపోయింది ఓ యువతి. కానీ చివరకు మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా హోలేనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

Read also: పర్ఫ్యూమ్ కి, డియోడ్రంట్ కి మధ్య తేడా ఏంటో తెలుసా?

పరసనహళ్లి కి చెందిన కావ్య (23) కు హాసన్ కి చెందిన యువకునితో ఏడాదిన్నర క్రితం తల్లిదండ్రులు వైభవంగా వివాహం చేశారు. కానీ కావ్యకు వివాహం కన్నా ముందే అవినాష్ అనే యువకునితో పరిచయం ఉండేది. పెళ్లయిన తర్వాత కూడా కావ్య ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోయింది. దాంతో వివాహమైన నాలుగు నెలలకే భర్త వద్దు.. ప్రియుడే ముద్దు అనుకొని ఆమె ప్రేమించిన అవినాష్ దగ్గరకు వెళ్ళిపోయింది. అవినాష్ మాత్రం ఏ పని చేయకుండా తిరిగేవాడు. ఇక అతని దగ్గరికి వెళ్ళినప్పటి నుండి పుట్టింటి వారితో కూడా ఫోన్లో మాట్లాడేది కాదు. అలా వారి జీవనం సాగుతుండగా నెల రోజుల క్రితం కూతురు ఎక్కడ ఉందో, ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అప్పుడు కావ్య తాను బెంగుళూరులో పని చేసుకుంటూ.. అక్కడే ఉన్న ఓ హాస్టల్ లో ఉంటున్నానని అబద్ధం చెప్పింది.

Advertisement

ఇలా కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలియదు కానీ అవినాష్ హోలేనరశిపుర తహసిల్దార్, పోలీసులను కలసి కావ్య మృతి చెందిందని.. ఆమె డెడ్ బాడీ చెరుకు తోటలో పడి ఉందని వారికి తెలిపాడు. దీంతో అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ కావ్య మృతదేహం కనిపించింది. అది కూడా కొంతమేర పూడ్చి పెట్టి ఉంది. వెలికితీసి పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కావ్యమరణ వార్త తెలిసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి కుమార్తెను అవినాష్ హత్య చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి మాటలను నమ్మి నాశనమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read also: ఛత్రపతి సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

 

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd