Advertisement
బద్రి మూవీ టైం లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారసుల ఊపు అందుకుంది. కృష్ణ ఫ్యామిలీ నుంచి పెద్ద కొడుకు రమేష్ బాబు కొడుకు జై కృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఎంట్రీని ప్రకటించడం కూడా జరిగింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రాబోతుంది. అలాగే హరికృష్ణ మనవడు జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ కూడా హీరో రాబోతున్నారు. మహేష్ బాబు కొడుకు, పవన్ కళ్యాణ్ కొడుకులకు సంబంధించి టాపిక్ కూడా వస్తోంది.
Advertisement
అకిరా నందన్ బాగా కనిపించారు. ఏపీలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన సమయంలో తండ్రి వెంటే ఉన్నారు. చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు అలాగే ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినప్పుడు కూడా అకీరా ఉన్నారు. జనసేన పార్టీ 100% గెలుపు సాధించడంతో సెలబ్రేషన్ ని తండ్రితో పాటుగా ఎంజాయ్ చేశాడు. దీంతో సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎప్పుడు సినిమాల్లోకి వస్తారని అందరిలో క్యూరియాసిటీ మొదలైంది ఆ మధ్య తల్లి రేణు దేశాయ్ స్పందిస్తూ ఇప్పట్లో సినిమాల్లోకి రావడం లేదని చెప్పారు.
Advertisement
Also read:
ప్రస్తుతం అకీరా ఫోకస్ స్టడీస్ మ్యూజిక్ పై ఉందని.. ఎక్కువగా మ్యూజిక్ కి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. అకీరాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలని రేణు దేశాయ్ బయటపెట్టారు పవన్ నుంచి అకీరాకు వచ్చిన క్వాలిటీస్ ఏంటనే ప్రశ్న ఎదురు కాగా అసలు విషయాన్ని ఆమె చెప్పారు. పవన్ లాగ అకీరాకు కూడా ప్రకృతి అంటే ఇష్టం అని నేచురల్ గా వచ్చే ఫుడ్ ని తీసుకుంటాడని వెజిటేరియన్ అని చెప్పారు. మధ్యమధ్యలో పన్నీర్ తీసుకుంటాడట హెల్త్ కి పై దృష్టి పెడతాడని ఫిట్ గా ఉండాలని తపిస్తాడని.. యోగా ప్రాణాయామం మార్షల్ ఆర్ట్స్ చేస్తాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న విషయం తెలిసిందే.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!