Ads
అక్కినేని నాగార్జున, అమల దంపతులకు టాలీవుడ్ లో ప్రత్యేక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మన్మధుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జునకు ఇంత వయసు వచ్చినా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గలేదు. నాగార్జున, అమల ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అమలను ప్రేమించడానికి ముందే అక్కినేని నాగార్జున దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య జన్మించారు. ఆ తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి: నీరజను వెంకటేష్ ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే?
లక్ష్మి దగ్గుబాటితో విడాకుల తరువాత నాగార్జున అమలలు ప్రేమించుకున్నారు. అమల కూడా పెళ్లికి ముందు సినీ నటి. అయితే.. నాగార్జునను ప్రేమించిన తరువాత ఆమె సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి నాగార్జునతో వైవాహిక జీవితం ప్రారంభించారు. వీరిద్దరికి అఖిల్ జన్మించాడు. అయితే.. సినిమాల ద్వారా వీరిద్దరూ బాగానే సంపాదించారు. ఇక నాగార్జున కూడా గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. వేల కోట్ల ఆస్తిని సంపాదించుకున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి: ఈ సినిమాను చిన్నపిల్లలతో కలిసి చూడకూడదట.. ఎందుకు ఇలా అన్నారంటే?
ఇంత ఆస్తి ఉన్నా నాగార్జున భార్య అమల చాలా సింపుల్ గా కనిపిస్తారు. మెడలో చిన్న నల్లపూసని తప్ప మరే ఇతర నగలను వేసుకోరు. అలా అని ఆవిడకి బంగారం అంటే ఇష్టం లేకపోవడం కూడా కాదు. అమలకు బంగారు నగలు వేసుకోవడం అంటే చాలా ఇష్టమట. కానీ, ఆమె వేసుకోలేరు. కారణం ఏమిటంటే.. ఆమెకు ఉన్న స్కిన్ అలర్జీ. బంగారు నగలు వేసుకుంటే ఆమె చర్మానికి సరిపడదు. అలర్జీ వచ్చి ఆమె ఇబ్బందులు పడతారట. అందుకే ఎంత ఇష్టం ఉన్నా, కొనుక్కునే స్థోమత ఉన్నా, ఆమెకు బంగారు నగలు వేసుకునే అదృష్టం లేదు. అయితే.. అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి అమల కూడా బంగారు నగలను దూరంగా ఉంచుతారట.
మరిన్ని..
Bhagath Singh: భగత్ సింగ్ చెప్పిన ఈ ఆఖరు మాటలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..!