Advertisement
40 ఏళ్లకే గుండెపోటుతో అర్ధాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. తారకరత్న మరణంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. జనవరి 27వ తేదీన గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున మరణించారు తారకరత్న. ఆయన మరణించి పది రోజులు కావడంతో ఆయన పెద్దకర్మను మార్చి రెండవ తేదీన ఫిలిం క్లబ్ కల్చర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Read also: SR.NTR: ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?
అయితే తారకరత్న మరణాన్ని ఆయన సతీమణి అలేఖ్య జీర్ణించుకోలేకపోతోంది. పెద్దకర్మ సందర్భంగా మరోసారి తీవ్ర భగవద్వేగానికి గురైంది అలేఖ్య రెడ్డి. వాలెంటెన్స్ డే సందర్భంగా తారకరత్న తనకు రాసిన ప్రేమ లేఖను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫోటోని కూడా పంచుకుంది. అయితే ఈ లెటర్ లో అలేఖ్య పై తనకున్న ప్రేమను అక్షర రూపం ఇస్తూ తారకరత్న రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. ” మనం మన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం, ఎన్నో ఎత్తుపల్లాలను చూశాం, వాటన్నింటినీ అధిగమించి చాలా దూరం ప్రయాణం చేశాం.
Advertisement
మనకు కష్టాలు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం చాలా ఎదురు చూశాం. మనమిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నువ్వేంటో ఎవరికీ తెలియదు, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ మనసులోనే దాచుకొని కేవలం మాకు ప్రేమను మాత్రమే పంచావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సమస్యలు సృష్టించిన నువ్వు మా చుట్టే ఉన్నావు. నాకున్నది నువ్వు మాత్రమే. నువ్వంటే నా ప్రపంచం బంగారం” అంటూ తన భార్యకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు తారకరత్న. ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Read also: చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ఏ సినిమాతో అంటే ??