• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Alekya Reddy: భర్త కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైన అలేఖ్య రెడ్డి.. !

Alekya Reddy: భర్త కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైన అలేఖ్య రెడ్డి.. !

Published on May 14, 2023 by karthik

Advertisement

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న మొదటి రోజే గుండెపోటుకు గురై.. కొద్ది రోజులు చికిత్స తీసుకున్న తర్వాత నందమూరి తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. సినిమాలు కలిసి రాకపోవడంతో రాజకీయాలలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని భావించిన తారకరత్న ఆ కోరిక నెరవేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి ఒంటరైన విషయం తెలిసిందే. ఇక తారకరత్న మరణించారనే బాధనుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన భార్య అలేఖ్యరెడ్డి.

 

తన భర్తను తలుచుకుంటూ తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ బాధను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా అలేఖ్యకు సంబంధించిన ఓ వార్త సినీ రాజకీయ రంగాలలో తీవ్ర చర్చలకు కారణమైంది. గత ఎన్నికలలో ఘోర పరాభవం పాలైన టిడిపి.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో గుడివాడ ఒకటి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ఓటమికి వ్యూహాలు రచిస్తుంది టిడిపి. అయితే వచ్చే ఎన్నికలలో అలేఖ్య రెడ్డి గుడివాడ ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

అయితే ముందు తారకరత్న గుడివాడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లని కూడా పూర్తి చేసుకున్నారట. కానీ ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడంతో ఇప్పుడు ఆయన కోరికను తీర్చడం కోసం అలేఖ్య రెడ్డి ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే అలేఖ్యను గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. కానీ ఈ విషయం గురించి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగానూ అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ.. ఈ విషయం మీద అటు జిల్లా వర్గాల్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది.

Advertisement

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

  • హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఏవంటే…?
  • ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకోసం ఎన్ని కథలను మార్చారో తెలుసా ?
  • వెంకటేష్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా… ఆమె ఆస్తులు ఎంత అంటే!

Related posts:

జగన్ కు కౌంటర్.. ట్రైలర్ లోనే సినిమా చూపించిన బాలయ్య! సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..? పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..? చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో ఈ చిన్నారి ఎవరో..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd