Advertisement
Anchor Meghana: బుల్లితెరపై యాంకర్ గా తనదైన స్టైల్, క్రేజ్ సాధించిన అందాల భామ మేఘన ఇటీవల వరుసగా పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా యాంకర్ మేఘన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
Anchor Meghana Back ground
Also Read: ఉరి శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను చివరి భాగాన్ని విరిచివేస్తారు..ఎందుకు..?
Advertisement
మెగా ఫ్యామిలీకి చెందిన అప్ కమింగ్ హీరో పవన్ తేజ్ కొనిదెలను గత కొంతకాలంగా ప్రేమిస్తుంది యాంకర్ మేఘన. అయితే తాజాగా వీరిద్దరికీ నిశ్చితార్థం చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు. ఈ జంటకు నిశ్చితార్థం సందర్భంగా ఆమె ఆశీస్సులు అందించారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి పలువురు సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.
చిరుకు సోదరుడి కుమారుడైన పవన్ తేజ్ కొనిదెలతో మేఘన నిశ్చితార్థం జరగడంతో, ఈ బుల్లితెర యాంకర్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కోడలిగా మారనుంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా మేఘన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
Also Read: ‘అంటే సుందరానికి’ మూవీలో హీరో బామ్మగా నటించిన నటి ఎవరంటే..