Advertisement
ఖగోళంలో ఏర్పడే కొన్ని మార్పులు చేర్పులు అనేవి మానవ జాతకం పై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గ్రహాల గమనంలో మార్పులు ఏర్పడటం వల్ల చాలామంది రాశుల వారిపై ప్రభావం చూపి అది మంచి జరగవచ్చు, లేదంటే చెడు జరగవచ్చు. ఇలా నక్షత్రాల గమనం గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటే, మరికొందరికి చెడు ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ఏప్రిల్ లో రాబోయే సూర్యగ్రహణం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఖగోళంలో ఏర్పడే మార్పుల్లో సూర్య గ్రహణం ఒకటి.
also read: India Top5 trains:భారత్ లో టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!
ఈ ఏడాది ఏర్పడబోయే సూర్య గ్రహణ సమయంలో ఈ మూడు రాశుల వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. ఇంతకీ ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం.. 2023 సంవత్సరంలో తొలిసారి సూర్యగ్రహణం ఎప్పుడు ఏప్రిల్ 20న ఏర్పడుతోంది. హిందువులు గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు, పూజలు కాని పెట్టుకోరు. దేవాలయాలను మూసివేస్తారు. అయితే ఏప్రిల్ లో ఏర్పడబోయే గ్రహణ ప్రభావం మొత్తం 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. సూర్యగ్రహణం ఏ రాశుల వారిపై చెడు ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూసేద్దాం..
Advertisement
also read:ఈ వీక్ ఓటిటి లోకి 14చిత్రాలు.. ఆ ఒక్కటి చాలా స్పెషల్..!!
సూర్యగ్రహణం వల్ల ఈ మూడు రాశుల వారికి ఆశుభం కలుగుతుందట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేష, సింహ, కన్య.. ఈ రాశుల వారికి సూర్యగ్రహణం కలిసి రాదు. మేషరాశి వారిపై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మిగతా రెండు రాశుల వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి. వస్తుంది. ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం భారత దేశంలో ఎక్కువగా కనిపించదు. సూర్యగ్రహణం ఆగ్నేయాసియా, హిందూ మహాసముద్రం, ఆస్ట్రేలియా వంటి ప్రదేశాలలో కనిపిస్తుందట. ఒకవేళ ఈ రాశుల వారు ఆ ప్రదేశాలకు ఈ సమయంలో వెళ్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Advertisement
also read: