Advertisement
ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ సెలబ్రిటీల గురించిన జ్యోతిష్యం పై ఆయన ఆసక్తికర విషయాలను చెబుతూ ఉంటారు. గతంలో సమంత మరియు నాగచైతన్య పెళ్లి సమయంలోనే వారికి వివాహం కలసి రాదని.. వారు త్వరలోనే విడిపోతారు అని జోష్యం చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పిన విధంగానే నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వేణు స్వామి లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి కూడా షాకింగ్ కామెంట్లు చేశారు.
Read also: హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేయాలి?
Advertisement
ఐదు సంవత్సరాలు ప్రేమించి నయనతార ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ తో లాక్ డౌన్ సమయంలో జూన్ 9న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నయనతార కి పెళ్లి అచ్చి రాదని.. వివాహం తర్వాత ఆమె జీవితంలో కలతలు, విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అవి విడాకులకు దారి తీసే అవకాశం కూడా ఉందని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు నయనతారకు పెద్ద సమస్య వచ్చి పడింది. భర్త విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార నిర్మించిన తాజా చిత్రం కనెక్ట్. ఆత్మల నేపద్య కథాంశంతో తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార ప్రధాన పాత్ర పోషించింది.
ఈ చిత్రం డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి బిగ్ షాక్ తగిలింది. థియేటర్ యాజమానులు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంటర్వెల్ సమయంలో అమ్మే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్, చిప్స్ వంటి వాటితో తమకు ఎంతో కొంత డబ్బు వస్తుందని.. అసలు బ్రేక్ లేకుండా సినిమా వేస్తే ఆ డబ్బు రాకుండా పోతుందని భావిస్తున్నారు. దీంతో గతంలో వేణు స్వామి పెళ్లి తర్వాత నయనతార సమస్యలలో ఇరుక్కుంటుందని చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది అంటున్నారు.
Advertisement
Read also: కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?