• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » బాహుబలి 3 గురించి రాజమౌళి అప్పుడే హింట్ ఇచ్చారు గా..! మీరు గుర్తు పట్టారా ?

బాహుబలి 3 గురించి రాజమౌళి అప్పుడే హింట్ ఇచ్చారు గా..! మీరు గుర్తు పట్టారా ?

Published on January 6, 2023 by karthik

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి రెండు పార్టులుగా తెరకెక్కించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా, అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించగా.. రాజమౌళి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయాడు. ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. బాహుబలి ది బిగినింగ్, ది కంక్లూజన్ పేరుతో రెండు భాగాలు రాగా.. మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న మొదలైంది. ఇక రెండవ భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. పార్ట్ 2 కూడా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read also: పంత్ యాక్సిడెంట్.. సాయం చేయకపోగా, డబ్బులు దోచుకెళ్లిన స్థానికులు!

అయితే ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా బాహుబలి 3 రాబోతుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పారు. కానీ దీనికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. ఆ తర్వాత మూడో భాగంపై ఎన్ని పుకార్లు వచ్చినా రాజమౌళి కూడా వీటిపై స్పందించలేదు. అయితే తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో మూవీ మారథాన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జక్కన్న కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలోనే జక్కన్నకు బాహుబలి పార్ట్ 3 కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

Advertisement

దాంతో ఆయన తాను చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా సంభాషణను పెట్టినట్టు చెప్పారు. అలా బాహుబలి సినిమాలో క్లైమాక్స్ లోనే జక్కన్న ఆ సంభాషణను పెట్టారు. ఆ సంభాషణ స్వామీజీ పాత్రధారి తనికెళ్ల భరణికి, చిన్నారి మధ్య జరుగుతుంది. ఆ స్వామీజీని చిన్నారి.. “తాత.. మహేంద్ర బాహుబలి కొడుకు రాజు అయ్యాడా” అని అడుగుతుంది. దానికి.. “ఏమో.. శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక ” అని బదులిస్తారు. దీన్నిబట్టి మూడో పార్ట్ గురించి రాజమౌళి ముందే హింట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓ నెటిజన్ దీనిని షేర్ చేసి బాహుబలి 3 రాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

In Q&A session after the Movie Marathon, #Rajamouli said that he left only one "open-ended conversation" out of all his films. That is during Bahubali 2 end credits, there is a voice over of a small girl, hinting for Bahubali 3. How many of you observed that? #Bahubali #Bahubali3

— Anup Dasari (@anupdasari) October 3, 2022

Advertisement

Read also: WALTAIR VEERAYYA FIRST REVIEW IN TELUGU: ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఫస్ట్ రివ్యూ

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd