Advertisement
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవితకు బెయిల్ వచ్చింది. చాలా కాలం నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు మంగళవారం ఆమెకు బెల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు బెయిల్ రావడానికి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తీవ్రమైన కృషి చేశారు. ఆయన కృషి వలన ఆమెకు బెయిల్ వచ్చింది. కవిత బెయిల్ మంజూరు కి సంబంధించి మంగళవారం గంటన్నరకు పైగా ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి.
Advertisement
Advertisement
కవిత బెయిల్ పొందడానికి ముకుల్ వాదించడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవించింది. చివరకు కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన 1955 ఆగస్టు 17 ముంబైలో పుట్టారు గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఆయన సీనియర్ న్యాయవాదిగా కొనసాగిస్తున్నారు. ముకుల్ తండ్రి కూడా న్యాయవాదే. ముంబాయి ప్రభుత్వ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు.
తర్వాత ఢిల్లీలోనే హైకోర్టులో యోగేష్ కుమార్ వద్ద ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనేక విధాలుగా ఆయన ఎదిగారు. ముకుల్ వసుధను పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా న్యాయవాది. 2014 నుంచి 2017 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముకుల్ భారత అటార్నీ జనరల్ గా పనిచేశారు. త్రిబుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్, జాతీయ న్యాయ నియమాకాల కమిషన్, ఆధార్ వంటి కేసుల్లో అద్భుతమైన వాదనలు వినిపించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లా ఆఫీసర్ గా పని చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!