Advertisement
ఫలానా వారి పెళ్లి కుదిరింది అనగానే మొట్టమొదట వేసే ప్రశ్న కట్నం ఎంత ఇస్తున్నారు? అనే అడుగుతారు. కొంతలో కొంత ఉద్యోగస్తుల విషయంలో ఈ వరకట్నం ప్రస్తావన తక్కువ అయినప్పటికీ వ్యాపారుల విషయంలో మాత్రం అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. దశాబ్దాల క్రితం కన్యాశుల్కం పేరుతో వధువుకు ఎదురు కట్నం ఇచ్చి వివాహాలు చేసుకునేవారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు డబ్బు ఆశ చూపి ఇలా చేసేవారు. కన్యాశుల్కం పోయి వరకట్నం రోజులు వచ్చి అర్ధ శతాబ్దం పైన మాటే. అయినా ఈ వరకట్నం అనేది చాప కింద నీరులా అన్ని కుటుంబాల నాశనానికి, పతనానికి దారితీస్తుంది. అయితే తమిళనాడుకు చెందిన ఓ కలెక్టర్ కూడా కట్నం ఆశించాడు.
Read also: డబుల్ సెంచరీ సాధించిన ఈ ఆటగాళ్లలో ఉన్నా కామన్ పాయింట్ ఎంత మంది గమనించారు ?
కానీ ఆయన తీసుకున్న కట్నం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఓ కుర్రాడు ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించాడు. తమిళనాడు తంజావూరు జిల్లా మెలోట్టంకడు గ్రామానికి చెందిన శివ గురువు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అయితే తండ్రి మద్యానికి బానిస కావడంతో తల్లి కుటుంబ బాధ్యతలను మోస్తూ వచ్చింది. చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు అనుభవించిన ప్రభాకరన్ కు చదువుపై ఎంతో ఆసక్తి ఉండేది. దాంతో చిన్న వయసు నుండే కష్టపడి చదువుకున్నాడు. కష్టపడి చదివి ఐఐటి మద్రాస్ లో సీటు సంపాదించాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ట్యూషన్ చెబుతూ.. మరోవైపు మొబైల్ షాప్ లో పనిచేస్తూ తన డబ్బును తానే స్వయంగా సంపాదించుకున్నాడు. అలా తను సంపాదించిన దానిలో కొంత కుటుంబానికి కూడా సహాయపడ్డాడు.
Advertisement
అలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత అతను కన్న కలని నిజం చేసుకున్నాడు. కలెక్టర్ ఉద్యోగం సాధించి అనంతరం ఓ వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందు ప్రభాకర్ అడిగిన కట్నానికి అతనికి కాబోయే భార్య ఆశ్చర్యపోయింది. ఆయన అడిగిన కట్నం ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అదేంటంటే.. పెళ్లి తర్వాత వారానికి రెండు రోజులపాటు గ్రామాలలో ఉచితంగా పేదలకు వైద్య సాయం చేయాలని తనకి కాబోయే భార్యకు కండిషన్ పెట్టాడట ప్రభాకర్. అతని కండిషన్ కు ఆయన భార్య కూడా ఓకే చెప్పింది. ప్రస్తుతం వీరి స్టోరీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
Advertisement
Read also: కృష్ణ వీలునామాలో కీలక విషయాలు.. ఆస్తులు మొత్తం వాళ్ళకే..?