Advertisement
మన హిందువులు చెట్టు పుట్టా రాయి రప్ప ఇలా ప్రతి ఒక్క దాన్ని దేవుడిలా భావిస్తారు.. ఇందులో హిందువులు ఎక్కువగా పూజించేది శంఖం. హిందూ మతంలో శంఖానికి గొప్ప స్థానం ఉంది. ఈ శంఖం మహా విష్ణువు చేతిలో ఆభరణం. ఈ శంఖం ఎక్కడ ఉంటే అక్కడ మహావిష్ణువు ఉంటాడని అంటారు. ఈ శంఖాన్ని నియంత్రిత శ్వాసతో ఊదినపుడు ఓంకార శబ్దం వినిపిస్తుంది. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ శంఖాలలో కూడా గణేష్ శంఖం, పంచముఖి శంఖం, ఆవు శంఖం వంటివి ఉంటాయి.
also read:వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
Advertisement
ఇంట్లో శంఖం ఉండడం వల్ల సరస్వతి దేవి సూచిస్తుంది. వైకుంఠ వాసి విష్ణుకు ఇష్టమైన శంఖం ఎవరైనా చనిపోతే ఉదుతారు. దానిని దేవుని పీఠంపై ఉంచి పూజిస్తారు. శంఖం సంపదకు అధిపతి అయిన కుబేరుని నివాసంగా పరిగణంచబడుతుంది. పురాణ కాలం నుండి కూడా శంఖానికి పవిత్ర స్థానం ఉంది. చాలా చోట్ల శంఖాన్ని అలంకార వస్తువుగా కూడా ఉపయోగిస్తారు. శంఖం గుళ్ల తర్వాత సముద్ర తీరం పర్యాటక ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి.
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 30.03.2023
పురాణాల ప్రకారం శంఖం మధ్యలో వరునుడు, వెనుక భాగంలో బ్రహ్మ, ముందు భాగంలో సరస్వతి గంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ శంఖాన్ని ప్రార్థన ప్రారంభంలో లేదా ఏదైనా శుభారంభంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉంచబడిన నీటిని పవిత్రజళంగా భావిస్తారు. ఈ శంఖాన్ని మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు అన్ని శుభ ఫలితాలే రావడమే కాకుండా ఆర్థికంగా కూడా బాగుంటామని పండితులు అంటున్నారు.
Advertisement
also read:Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?