Ads
Pawan Kalyan Janasena: బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడుగగా బ్రతువు దెరువు కోసం వచ్చాను. ఏదైనా పని ఉంటే చెప్పండి అనగా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులని తోలుకెళ్ళమని చెప్పగా, బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారాడు.
అయితే, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇది ఇలా ఉండగా, తాజాగా, పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానం లోనే ప్రస్తావించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
“ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడోచ్చేనయ!
రాజ వారసత్వము నశించినయ!
ప్రజారాజ్యము విలసిల్లునయ!తప్పదు నా మాట నమ్మండయ!!”
Advertisement
అని బ్రహ్మంగారు చెప్పారని ట్విట్టర్లో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి ఎప్పుడు వస్తుందోనని జనసైనికులు తెగ వెతికేస్తున్నారు.1919, 1979, 2029, 2099 లో సిద్ధార్థి నామ సంవత్సరం వస్తుందని కొందరు వికీపీడియా లింకును షేర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని, ఒకవేళ కుదరని పక్షంలో 2029 లో అధికారం కచ్చితంగా తమదేనని జన సైనికులు బలంగా నమ్ముతున్నారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొంది 2039 కావడంతో ఒకింత నిరాశ చెందుతున్నారు. కాకపోతే, ఇదంతా నిజంగా కాలజ్ఞానంలో ఉందా? లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది ప్రచారం చేస్తున్నారా? అనే సందేహం సైతం తలెత్తుతోంది. ఇందులో ఉన్న తెలుగు రాష్ట్రము, పవనుడు, ప్రజారాజ్యము అనే మాటలు కల్పితంగానే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్ర దోషము వీడేనయా, అంటూ ‘కాలజ్ఞానా’న్ని వైరల్ చేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోను, కరోనా వస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
బ్రహ్మంగారి కాలజ్ఞానం
వచ్చేది పవనుడు@Bobbilijsp @satish664422 @UAJanasainyam @SardaarSankar @ pic.twitter.com/9259EdY3W9— Gangadhar sanchana (@gangadhar4466) June 20, 2022
Read also: రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలుసా ?