Ads
Bramhastra movie review and rating :రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తిరకెక్కిన ‘బ్రహ్మస్త్ర పార్ట్ 1’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల అవుతోంది. అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనుండటం విశేషం. అమితాబచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనిరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ లో ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలు వచ్చినట్లు డిజాస్టర్ మూటగట్టుకుంటున్న తరుణంలో బ్రహ్మాస్త్ర ఆ పరంపరను బ్రేక్ చేస్తుందా, ఇప్పుడు తెలుసుకుందాం.
Bramhastra movie review and rating
#కథ మరియు వివరణ :
ఈ కథ మూడు ముక్కలుగా చేయబడ్డ బ్రహ్మాస్త్ర నీ కాపాడుతున్న బ్రహ్మాన్షు గ్రూపు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం ను అనీష్ (నాగార్జున) వద్ద ఉండగా రెండవ భాగం మోహన్ భార్గవ్ (షారుక్ ఖాన్) అనే శాస్త్రవేత్త వద్ద ఉంటుంది. విడివిడిగా ఉన్న మూడు భాగాలను కలపడం ద్వారా అద్భుత శక్తివంతమైన బ్రహ్మాస్త్ర నీ పొందాలని మౌని రాయ్ అండ్ విలన్ గ్రూపు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో కథలోకి డీజే శివ (రణబీర్ కపూర్) ఎంట్రీ ఇస్తాడు. ఆయనకి బ్రహ్మస్త్ర కి సంబంధం ఏంటి? ఇంతకు మూడవ భాగం ఎక్కడ ఉంది? విలనవిలన్ గ్రూప్ కోరుకున్న బ్రహ్మాస్త్రం ను సాధించారా అనేది సినిమా కథాంశం.
Advertisement
దర్శకుడు అయాన్ ముఖర్జీ కథా మరియు స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఒక మూస కథ ని అదే మూస పద్ధతిలో స్క్రీన్ ప్లే నడిపించినట్లుగా ఉంది. బిఎఫ్ఎక్స్ వర్క్ కొన్ని సన్నివేశాల్లో చాలా బాగుంది. ఒక భారతీయ సినిమాలో అది కూడా రాజమౌళి సినిమా కాకుండా ఇంతటి గ్రాఫిక్స్ ను చూడటం నిజంగా గొప్ప విషయం అన్నట్లుగా ఉంది. పాటలు కొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. వాటి చిత్రీకరణ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పలు సన్నివేశాలను చాలా గ్రాండ్ గా చూపించాడు. ఎడిటింగ్ లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. పలు అనవసర లాగ్స్ ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు కథ డిమాండ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి.
#ప్లస్ పాయింట్స్:
రణబీర్ కపూర్, ఆలియా జోడి
విఎఫ్ఎక్స్ వర్క్
పాటలు
#మైనస్ పాయింట్స్:
కథ, కథనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్
#రేటింగ్: 2.25/5.
READ ALSO : Oke Oka Jeevitham : ‘ఒకే ఒక జీవితం’ రివ్యూ