Ads
ఇటీవల కాలం విడాకుల సంఖ్యా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు వివిధ కారణాలతో, ఈగోలతో వివాహ బంధానికి దూరం అవుతున్నారు. ఇదంతా ఒక రకం అనుకుంటే.. ఇప్పుడు విచిత్రంగా వయసు మళ్ళిన వారు కూడా వివాహ బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు అన్నీ తీరిన తరువాత, మనవళ్లను మానవరాళ్లను చూసుకున్నాక కూడా ఆలు మగలు ఒకరినొకరు దూరం అవ్వాలని కోరుకుంటున్న వారు కోకొల్లలు ఉన్నారు.
విడాకుల కోసం వస్తున్న వృద్ధ దంపతుల సంఖ్యా కూడా తక్కువేమీ కాదు. ఇటీవల బొంబాయిలో విడాకులు తీసుకున్న ఓ వృద్ధ దంపతుల కేసు వైరల్ అయ్యింది. ఆమె వయసు సుమారుగా డెబ్భై ఉండొచ్చు. ఆయన వయసు 74 . నలభై ఏడేళ్ల సంసారం, బాధ్యతలు తీర్చుకుని, మనవళ్లను, మనవరాళ్లను చూసుకున్నాక విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ వయసులో ఉండే ముసలి చాదస్తాలు ఒకరివి మరొకరికి నచ్చడం లేదు. విసుగుతో మొదలై విడిపోదాం అనుకునే వరకూ వచ్చారు. కోర్టు వద్ద పరస్పర అంగీకారం తెలుపుకున్నారు. డబ్బున్న వాళ్లే కాబట్టి.. భార్యకి ఎక్కువ ఆస్తి చెందాలని ఆయన, యాభై కోట్లు విలువ చేసే విల్లాతో పాటు పది కోట్ల నగదు డిపాజిట్ భర్తకి ఉండడం మంచిదని ఆమె భావించారు. ఫ్రెండ్లీగానే ఇద్దరూ విడిపోయారు.
Advertisement
ఎవరిదారి వారు చూసుకోవాలని ఫిక్స్ అయ్యారు. వీరికి విడాకులు మంజూరు అయ్యాక వారి మనవళ్ళు ట్రైడెంట్ స్టార్ హోటల్ లో టాప్ ఫ్లోర్ లో అవ్వా-తాతల బ్రేకప్ పార్టీని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. దీనికి “సిల్వర్ లైనింగ్ డివోర్స్” అని కూడా పేరు ఉంది. బాధ్యతలు తీరి, వయసు ఉడిగిపోయాక కనీసం పోయే ముందు అయినా ఎవరికీ వారు నచ్చినట్లు బతకాలి అన్న కోరిక పెరుగుతుండడంతో ఈ వృద్ధ దంపతుల డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎవరో అనుకుంటారు అని భయపడే రోజులు పోయాయి. ఎవరికీ నచ్చింది వారు చేయాలి అని అనుకుంటున్నారు. పోయే ముందు అయినా నచ్చినట్లు బతికి పోవాలి అని అనుకుంటున్నారు. విడాకులకు వయసుతో పనేముంది అని ఆలోచించే వారు ఎక్కువ అయ్యారు. ఈ కారణాల వలనే సిల్వర్ లైనింగ్ డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.
మరిన్ని..
రాజమౌళిని రిజెక్ట్ చేసిన 12 నటీనటులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!
Maa Oori Polimera 2 Cast, Crew, and Release Date details
Panasakaya in English: పనస పండు వలన ఇన్ని లాభాలు ఉన్నాయా?