Advertisement
తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోయాయి. ఏపీలో ఎన్నికలకి పార్టీలు రెడీ అవుతున్నాయి. అధికారంలోకి రావాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని, జగన్ అనుకుంటున్నారు. బీజీపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు పవన్ పార్టీలు కోరుకుంటున్నా, కమలం పార్టీ నుండి క్లియర్ గా ఏ విషయము తెలియట్లేదు. ఈ సమయంలో జగన్ ని ఎదుర్కోవాలంటే, అంతకుమించి సంక్షేమం ఇవ్వాలని, రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. దీనిలో భాగంగా కీలకమైన రెండు హామీల ప్రకటనకి సిద్ధమవుతున్నాయి.
Advertisement
అధికారంలో వచ్చిన సమయం నుండి అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి తనకి అధికారం ఇస్తుందని జగన్ భావిస్తున్నారు. జగన్ ని ఓడించాలంటే, సంక్షేమ ఓట్ బ్యాంక్ వాళ్ళ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు పవన్ అనుకుంటున్నారు. రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోపైన ముసాయిదా సిద్ధం చేశాయి. మహానాడు వేదికగా చంద్రబాబు మానిఫెస్టోని ప్రకటించారు. ఆశించిన స్థాయిలో మాత్రం రెస్పాన్స్ రాలేదు. దీంతో జనసేన పేర్కొన్న ఆరు ప్రధాన అంశాలని మేనిఫెస్టోలో చేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
వీటితో పాటుగా మెజారిటీ ఓటు బ్యాంకు వాళ్ళవైపు తిప్పుకునే విధంగా తాజాగా ఎన్నికల జరిగిన రాష్ట్రంలోని ప్రధాన హామీలను మేనిఫెస్టోలో చేర్చడానికి రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. పేదలకు ఉచిత గృహ విద్యుత్ అందించాలని ఆలోచనలో పడ్డాయి పార్టీలు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఒక వరాన్ని ప్రకటించాలని భావిస్తున్నాయి. అలానే రైతు రుణమాఫీ హామీలను ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాయి. అయితే టిడిపి జనసేన ఇచ్చిన హామీలు అమలు చేయవని జగన్ ఎన్నికలకి ముందే రుణమాఫీ చేస్తారని వైసిపి వల్ల ప్రచారంలో ఉంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!